భార్యను ఎమ్మెల్యేగా గెలిపించి, తీరిగ్గా ఎన్‌సీఏకి రవీంద్ర జడేజా... ఐపీఎల్ ఆడడానికేనా అంటూ ట్రోల్స్...

Published : Dec 21, 2022, 10:56 AM IST

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కెరీర్‌ గాడిలో పడింది ఈ మధ్యనే. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో జడేజాను గాయాలు తెగ ఇబ్బందిపెడుతున్నాయి. గత రెండేళ్లలో ఐదు సార్లు గాయపడిన రవీంద్ర జడేజా, రెండు సార్లు సర్జరీలు కూడా చేయించుకున్నాడు..

PREV
18
భార్యను ఎమ్మెల్యేగా గెలిపించి, తీరిగ్గా ఎన్‌సీఏకి రవీంద్ర జడేజా... ఐపీఎల్ ఆడడానికేనా అంటూ ట్రోల్స్...
Image credit: Getty

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008 అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న జడేజా.. 2009లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. అయితే టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ టీమ్‌కి మ్యాచ్ విన్నర్‌గా మారింది మాత్రం 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాతే...
 

28
Ravindra Jadeja

2020 ఆస్ట్రేలియా టూర్‌లో రెండు సార్లు గాయపడి జట్టుకి దూరమైన రవీంద్ర జడేజా, 2021-22 ఏడాదుల్లో మరో మూడు సార్లు గాయపడి టీమ్‌కి దూరమయ్యాడు. 2022 ఆసియా కప్ మధ్యలో జడేజా గాయం కారణంగా తప్పుకోవడం టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది..

38

రవీంద్ర జడేజా ఆడిన రెండు మ్యాచుల్లో ఆడిన టీమిండియా, ఆ తర్వాత జడ్డూ లేకుండా బరిలో దిగిన రెండు మ్యాచుల్లో ఓడింది. ఆసియా కప్‌‌లో గాయపడిన జడేజా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో కూడా జడేజా ఆడలేదు...

48

బంగ్లాదేశ్‌ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో రవీంద్ర జడేజాకి చోటు కల్పించారు సెలక్టర్లు. అయితే గాయం తగ్గలేదని, ఈ సిరీస్‌కి దూరమైన రవీంద్ర జడేజా... భార్య రివాబా జడేజా తరుపున ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై పాల్గొన్నాడు. భార్య రివాబాతో రోడ్డు షోలు, ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు హాజరయ్యాడు జడేజా...

58
Ravindra Jadeja Narendra Modi

రవీంద్ర జడేజాకి నిజంగా గాయం తగ్గలేదా? లేక భార్యను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికే టీమ్‌కి దూరంగా ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు క్రికెట్ ఫ్యాన్స్. రివాబా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విజయోత్సవాల్లోనూ జడ్డూ హడావుడి కనిపించింది...

68
jadeja

ఎట్టకేలకు రవీంద్ర జడేజా, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి చేరుకున్నాడు. గాయపడిన క్రికెటర్లు, తిరగి భారత జట్టులోకి రావాలంటే ఎన్‌సీఏకి చేరుకుని ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత జడేజా, ఎన్‌సీఏకి రావడంతో మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి...

78

రవీంద్ర జడేజా, టీమిండియా తరుపున ఆడడానికి ఎన్‌సీఏకి వచ్చాడని అందరూ అనుకుంటున్నారని, అయితే అతను ఐపీఎల్ కోసం సిద్ధమవ్వడానికే అకాడమీలో చేరాడని అంటున్నారు నెటిజన్లు. ఐపీఎల్ ద్వారా జడ్డూకి రూ.16 కోట్లు వస్తున్నాయనే విషయం మరిచిపోకూడదని అంటున్నారు.. 

88
ravindra jadeja

టీమిండియా తరుపున ఆడడం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తిని టీమ్‌లో కొనసాగించడమే పెద్ద పొరపాటు అవుతుందని, జడ్డూకి భారత జట్టులో చోటు ఇవ్వకుండా కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!

Recommended Stories