సచిన్ టెండూల్కర్‌కి ఆ వీక్‌నెస్ ఉంది... వీరేంద్ర సెహ్వాగ్ అయితే చాలా డేంజరస్...

First Published Aug 21, 2021, 11:46 AM IST

‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి వచ్చినంత గుర్తింపు, వీరేంద్ర సెహ్వాగ్‌కి దక్కలేదు. టెస్టులపై యూత్‌కి ఆసక్తిపెంచేలా చేసిన వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ కంటే డేంజరస్ బ్యాట్స్‌మెన్ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్...

‘నేనెప్పుడూ సచిన్ టెండూల్కర్‌కి బౌలింగ్ చేయడానికి భయపడలేదు. ఎందుకంటే అతను దూకుడుగా బ్యాటింగ్ చేయాలని అనుకోడు. టెండూల్కర్ వికెట్ కాపాడుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇస్తాడు...

సచిన్ టెండూల్కర్ చాలా మంది బాల్ రీడర్. అతనికి ప్రతీ బౌలర్ టెక్నిక్స్ ఈజీగా అర్థమైపోతాయి... అయితే నా కెరీర్‌లో సచిన్‌కి ఆఫ్ స్పన్ బౌలింగ్‌లో చిన్న వీక్‌నెస్ ఉందని అర్థమైంది... లెగ్ స్పిన్ బౌలింగ్‌లో సచిన్ బౌండరీలు బాదుతాడు. అయితే ఆఫ్ స్పిన్ ఎదుర్కోవడానికి మాత్రం కొంచెం ఇబ్బందిపడతాడు...

ఈ కారణంగానే నేను సచిన్ టెండూల్కర్‌ను చాలాసార్లు అవుట్ చేయగలిగా... అలాగే చాలామంది ఆఫ్ స్పిన్నర్లు కూడా సచిన్‌ను త్వరగా అవుట్ చేయగలిగారు... అయితే దీని గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు...

సచిన్ టెండూల్కర్ ఓ డిఫరెంట్ ప్లేయర్. అతను అంత ఈజీగా వికెట్ ఇవ్వడు...’ అంటూ కామెంట్ చేశాడు ముత్తయ్య మురళీధరన్. వన్డేల్ల 530 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్, సచిన్ టెండూల్కర్‌ను 13 సార్లు అవుట్ చేశాడు...

‘సచిన్‌తో పోలిస్తే వీరేంద్ర సెహ్వాగ్ చాలా డేంజరస్ ప్లేయర్. అతనికి బౌలింగ్ చేస్తున్నప్పుడు, డీప్ ఫీల్డర్లను మోహరించేవాడిని. ఎందుకంటే అతను ఎక్కువసేపు డిఫెన్స్ ఆడడానికి ఇష్టపడడు. కచ్ఛితంగా ఛాన్స్ తీసుకుంటాడు...

తనదైన రోజున వీరేంద్ర సెహ్వాగ్‌ను అవుట్ చేయడం ఎవ్వరివల్లా కాదు. ప్రతీ బౌలర్‌ను దంచి కొట్టి, వదిలిపెడతాడు. అందుకే అలాంటి సమయాల్లో డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్ చేసి, అతను తప్పు చేసే దాకా వేచి చూడాలి...

వీరేంద్ర సెహ్వాగ్ యాటిట్యూడ్ కూడా చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. అతను రెండు గంటలు బ్యాటింగ్ చేస్తే, 150 పరుగులు చేస్తాడు. అదే రోజంతా బ్యాటింగ్ చేసి 300 కొట్టగలడు... అలాంటి స్పెషల్ బ్యాట్స్‌మెన్ వీరూ...

అలాంటి యాటిట్యూడ్ ఉన్న ప్లేయర్లే బౌలర్లకు చాలా డేంజరస్, మ్యాచ్ విన్నర్లు కూడా... నేటి తరంలో విరాట్ కోహ్లీ స్పిన్‌కి చక్కగా ఆడతాడు. టెస్టుల్లో అతని బ్యాటింగ్ బాగుంటుంది... బాబర్ ఆజమ్ కూడా బాగానే ఆడుతున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. 

click me!