తలకు తగిలేలా బౌన్సర్లు వెయ్యి... లార్డ్స్ టెస్టులో మహ్మద్ సిరాజ్, విరాట్, రోహిత్ సైగలు...

Published : Aug 21, 2021, 11:18 AM IST

లార్డ్స్ టెస్టులో టీమిండియా సాధించిన విజయం... ఇంకా క్రికెట్ ఫ్యాన్స్ బుర్రల్లో నుంచి పోవడం లేదు. టెస్టు మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల ఆట ఒక ఎత్తు అయితే, ఆఖరి రోజు ఆట మరో లెవెల్... ఉదయం ఆరంభ సెషన్ నుంచి ఇరు జట్ల మధ్య ఓ కోల్డ్ వార్ వాతావరణం కనిపించింది...

PREV
112
తలకు తగిలేలా బౌన్సర్లు వెయ్యి... లార్డ్స్ టెస్టులో మహ్మద్ సిరాజ్, విరాట్, రోహిత్ సైగలు...

జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్‌కి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు, అతని టార్గెట్ చేయడమే మ్యాచ్‌కి అసలైన టర్నింగ్ పాయింట్... బుమ్రాను టార్గెట్ చేస్తే మార్క్ వుడ్ బౌన్సర్లు వేయడం... ఆ తర్వాత జోస్ బట్లర్, మార్క్ వుడ్ మధ్య జరిగిన మాటల యుద్ధంతో టీమిండియా ప్లేయర్లు రగిలిపోయారు...

212

ఈ సంఘటనను పెవిలియన్ నుంచి వీక్షించిన విరాట్ కోహ్లీ... కోపంతో ఊగిపోయాడు. అప్పుడే రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటతీరు ఎలా ఉండబోతుందో క్రికెట్ ఫ్యాన్స్‌కి అర్థమైపోయింది....

312

బుమ్రా ఫోర్లు బాదినప్పుడు, షమీ సిక్సర్లు బాదినప్పుడు చప్పట్లతో వారిని ఉత్సాహపరిచిన విరాట్ కోహ్లీ... ఇన్నింగ్స్ బ్రేక్‌లో ‘ఇంగ్లాండ్ జట్టుకి ఈ 60 ఓవర్లలో నరకం చూపించాలి...’ అంటూ కామెంట్ చేయడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది...

412

ఇవన్నీ ఒక ఎత్తు అయితే... ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమిండియా చూపించిన దూకుడు మరో లెవెల్... మొదటి ఓవర్‌ నుంచి ప్రత్యర్థిపై పూర్తి డామినేషన్ చూపించడం మొదలెట్టింది టీమిండియా...

512

తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు పడడంతో భారత ఆటగాళ్లు, యుద్ధవీరుల్లా ఫుల్లు జోష్‌లో కనిపించారు. సైగలతో, చూపులతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను వణికించడం మొదలెట్టారు... 

612

ఓ రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాలో మిగిలిన జట్లపై ఎలాంటి ఆధిపత్యం చూపించిందో... టీమిండియాలో, లండన్‌లో ఇంగ్లాండ్‌పై అలాంటి డామినేషన్ చూపించింది... అంతకుమించి అని కూడా చెప్పొచ్చు...

712

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ తలను టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేయాలంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సైగలతో సూచించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

812

ముఖ్యంగా మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో ఈ ఇద్దరూ ఇలా సైగలతో రాకాసి బౌన్సర్లు వేయాలంటూ బౌలర్లకు సూచించారు...

912

జేమ్స్ అండర్సన్‌ క్రీజులోకి వచ్చిన సమయంలో కూడా విరాట్ కోహ్లీ, హెల్మెన్‌ను టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేయాలని సూచించడం... దానికి సిరాజ్ కూడా తలకు వేస్తానంటూ సైగలు చేయడం కనిపించింది...

1012

ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు కామెంట్లు చేస్తుంటే... ఆస్ట్రేలియా టూర్‌లో గబ్బా టెస్టులో ఛతేశ్వర్ పూజారాను టార్గెట్ చేస్తూ ఆసీస్ బౌలర్లు బౌన్సర్లు వేసినప్పుడు, ఎవరు ఇలా ఎందుకు కామెంట్ చేయలేదని వాదిస్తున్నారు మరికొందరు. 

1112

ఈ సంఘటనల తర్వాత ఇంగ్లాండ్, ఇండియా మధ్య టెస్టు సిరీస్‌కి మరింత క్రేజ్ పెరిగింది. మొదటి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓటమి నుంచి తప్పించుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు, కొందరు ప్లేయర్లు మాత్రం వర్షం వచ్చి, ఇండియాను ఓటమి నుంచి తప్పించిందని కామెంట్ చేశారు...

1212

రెండో టెస్టులో గెలిచిన టీమిండియా, అలాంటి విమర్శకులకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఇంకా మిగిలిన మూడు టెస్టుల్లో హోరాహోరీ పోరు ఉంటుందని ఆశిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!

Recommended Stories