ఫ్రెండ్ మ్యారేజ్‌ పార్టీలో సారా టెండల్కర్ రచ్చ... అతనే సారా కొత్త బాయ్‌ఫ్రెండ్ అంటూ గిల్‌పై...

Published : Nov 28, 2022, 04:30 PM IST

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పాలరాతి శిల్పంలా ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా మెరిసిపోయే సారా టెండూల్కర్, ఇండియాలో ఇంటిపట్టున ఉండే రోజుల కంటే విదేశాల్లో విహార యాత్రలు చేసే రోజులే ఎక్కువ. లండన్‌లో మెడిసిన్ పూర్తి చేసిన సారా, ఇప్పుడు అక్కడే ఎంజాయ్ చేస్తోంది...

PREV
17
ఫ్రెండ్ మ్యారేజ్‌ పార్టీలో సారా టెండల్కర్ రచ్చ... అతనే సారా కొత్త బాయ్‌ఫ్రెండ్ అంటూ గిల్‌పై...

లండన్‌లో ఓ ఫ్రెండ్ మ్యారేజ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సారా టెండూల్కర్, అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి ఓ నైట్ పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. నాలుక బయటికి పెట్టి, చిరునవ్వులు చిందిస్తూ ఫోజులిచ్చిన సారా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...

27

క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌, సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడిచిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఈ సారాకి గుడ్‌బై చెప్పిన శుబ్‌మన్ గిల్, బాలీవుడ్ సారా.. సారా ఆలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడు...
 

37

సారా ఆలీ ఖాన్, శుబ్‌మన్ గిల్ కలిసి హోటల్‌లో బస చేయడం, ఓకే ఫ్లైట్‌లో చక్కర్లు కొట్టడం, రెస్టారెంట్‌లో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. శుబ్‌మన్ గిల్ కూడా సారా ఆలీ ఖాన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశాడు...

47

ఇంతకుముందు సారా టెండూల్కర్ ఏ ఫోటోలు పెట్టినా శుబ్‌మన్ గిల్ గురించి కామెంట్లు పెట్టేవాళ్లు నెటిజన్లు. మనోడు రూట్ మార్చిన తర్వాత కూడా సారా ఫోటోలపై గిల్ గురించే కామెంట్లు వేస్తున్నాయి. లండన్‌ పార్టీలో సారా టెండూల్కర్‌పై ఓ కుర్రాడు చేతులు వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు..

57

విదేశాల్లో క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య చేతులు వేయడాలు, హగ్‌లు, బుగ్గన ముద్దులు పెట్టుకోవడాలు చాలా కామన్. అయితే అతనే సారా టెండూల్కర్ కొత్త బాయ్‌ఫ్రెండ్ అని, అలా నాలుక తెరిచి గిల్‌ని వెక్కిరిస్తోందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు...

67

శుబ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం గురించి పుకార్లు వచ్చినప్పుడు కూడా వాటిపై స్పందించడానికి ఇష్టపడని సారా టెండూల్కర్, తన ఫోటోలపై వస్తున్న ట్రోలింగ్‌ని ఏ మాత్రం లెక్కచేయడం లేదు...

 

77

మెడిసిన్ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించిన సారా టెండూల్కర్ త్వరలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతుందని ప్రచారం జరుగుతోంది.. 

click me!

Recommended Stories