ధోనీ చేసింది, నేను ఈ వయసులో చేసేస్తున్నా... రియాన్ పరాగ్ సెన్సేషనల్ కామెంట్స్...

First Published Nov 28, 2022, 2:02 PM IST

ఐపీఎల్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు ఉండడమే చాలా అరుదు. అస్సాం నుంచి వచ్చి, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున నాలుగు సీజన్లుగా ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రియాన్ పరాగ్. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాహుల్ తెవాటియాతో కలిసి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ని గెలిపించిన రియాన్ పరాగ్... అస్సామీ సంప్రదాయ నృత్యం బిహు స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్సించాడు...

ఆటగాడిగా తెచ్చుకున్న పేరు కంటే యాటిట్యూడ్‌తో రియాన్ పరాగ్ విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలే ఎక్కువ. తన కంటే సీనియర్లతో కూడా దురుసుగా ప్రవర్తించి, యాటిట్యూడ్ చూపించిన రియాన్ పరాగ్... తనకి స్ట్రైయిక్ ఇవ్వలేదని టీమ్‌మేట్ రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా అసహనం ప్రదర్శించాడు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో 17 మ్యాచుల్లో 138.64 స్ట్రైయిక్ రేటుతో 183 పరుగులు చేసిన రియాన్ పరాగ్, తనను తాను భారత మాజీ కెప్టెన్, ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చుకుంటూ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి...
 

Latest Videos


‘టీ20ల్లో చాలా కష్టమైన పని ఏంటంటే డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చి, మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం. నెంబర్ 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పని చేయగలిగారు... మహేంద్ర సింగ్ ధోనీ ఇందులో మాస్టర్... మిగిలిన ఎవ్వరూ మాహీ భాయ్‌ని టచ్ కూడా చేయలేరు...

నా కెరీర్ ఆరంభంలోనే నేను ఇది చేస్తున్నా. నేను మాస్టర్ అయిపోయానని అనడం లేదు, కానీ ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో నాకు తెలిసి వచ్చింది. అయితే నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తున్నా.. 

జనాలు నా గురించి ఏమైనా అనుకోని, అయితే అది ఎంత కష్టమో నాకు తెలుసు, నన్ను నమ్మిన నా టీమ్‌కి తెలుసు... జట్టులో నా రోల్ గురించి పూర్తి క్లారిటీ ఉంది. నా సామర్థ్యం గురించి టీమ్‌కి నమ్మకం ఉంది. జట్టులో ఏం జరుగుతుందో బయట ఉన్న జనాలకు తెలీదు. మరికొందరేమో ఏవేమో ఊహించుకుంటూ ఉంటారు. ప్రాక్టీస్ మ్యాచుల్లో నేను ఎలా ఆడుతున్నానో జట్టు చూస్తుంది...

Riyan Parag

జనాలకు అవేమీ వద్దు, వాళ్లు చూడరు కూడా. జనాలకు కావాల్సింది మ్యాచుల్లో బాగా ఆడడం. ఆడకపోతే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నాపై వచ్చిన విమర్శలు నాకేమీ బాధను కలిగించవు.

Riyan Parag

ఎందుకంటే రాయల్ ఫ్యామిలీ మొత్తం (రాజస్థాన్ రాయల్స్) నాపైన నమ్మకం ఉంచింది. దాన్ని నిలబెట్టుకోవడమే నా బాధ్యత. మిగిలిన విషయాలను నేను పట్టించుకోను..’ అంటూ చెప్పుకొచ్చాడు రియాన్ పరాగ్...

click me!