రిషబ్ పంత్ ఇలా అవ్వడానికి వాళ్లే కారణం... సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారంటున్న శ్రీకాంత్...

First Published Nov 28, 2022, 3:30 PM IST

ఐపీఎల్ 2020‌కి ముందు మూడు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన రిషబ్ పంత్, ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బేన్ టెస్టు తర్వాత మళ్లీ అన్ని ఫార్మాట్లలో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. వన్డే, టెస్టుల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నా టీ20ల్లో మాత్రం రిషబ్ పంత్ నుంచి టీమిండియా ఆశించిన ఇన్నింగ్స్‌ ఇప్పటిదాకా రాలేదు..

Rishabh Pant

ఐపీఎల్ 2022 తర్వాత రిషబ్ పంత్ కంటే ఎక్కువగా దినేశ్ కార్తీక్‌కి అవకాశాలు ఇస్తూ వచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. రిషబ్ పంత్ టీమ్‌లో ఉన్న మ్యాచుల్లో కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో హార్ధిక్ పాండ్యాకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది... ఓ రకంగా రిషబ్ పంత్ ఫామ్ కోల్పోయి పరుగులు చేయలేకపోవడానికి టీమ్‌ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యమే కారణమంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...

Image credit: Getty

‘రిషబ్ పంత్‌ మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. అతను ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. అయితే అతనికి ఇప్పుడు బ్రేక్ కావాలి. కొంతకాలం వేచి చూసి, జట్టులోకి తిరిగి వచ్చి ఆడమని అతనికి క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే టీమ్ మేనేజ్‌మెంట్, రిషబ్ పంత్‌ని సరిగ్గా వాడుకోలేకపోయింది...

పంత్ లాంటి ప్లేయర్లను ఆడిస్తూ పోయినా తప్పే అవుతుంది. అతన్ని కొన్ని మ్యాచులు పక్కనబెట్టండి. అప్పుడు టీమ్‌లోకి తిరిగి రావాలనే కసి పెరుగుతోంది. టీమ్‌లో నా ప్లేస్ ఫిక్స్ అనే భావన వస్తే.. కొందరు ప్లేయర్లు రిలాక్స్ అయిపోతారు. పెద్దగా కష్టపడడానికి ఇష్టపడరు.

Image credit: Getty

అలాంటప్పుడు జట్టు నుంచి ప్లేయర్‌ని తప్పిస్తే, సరిగ్గా ఆడకపోతే ఎవరి ప్లేస్‌కి గ్యారెంటీ లేదని తెలిసి వస్తుంది. అప్పుడు మిగిలిన ప్లేయర్లు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడతారు. రిషబ్ పంత్‌కి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అతను వాటిని సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు...

Rishabh Pant

పంతూ... ఇలాగైతే ఎలాగయ్యా! సంజూ శాంసన్ లాంటి ప్లేయర్లు, టీమ్‌లో ఒక్క ఛాన్స్ రావడం లేదని ఫీల్ అవుతుంటే, పంత్ ఏమో ఎన్ని ఛాన్సులు ఇచ్చినా వాటిని వృథా చేసుకుంటున్నాడు. వరల్డ్ కప్‌కి పెద్దగా సమయం కూడా లేదు. కాబట్టి రిషబ్ పంత్‌ లాంటి ప్లేయర్ రావాలంటే అతన్ని ఫామ్‌లోకి తేవాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌దే...

Image credit: Getty

అంతేకాకుండా రిషబ్ పంత్‌ ఆడకపోయినా అతనికి అన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇది కూడా అతని ఆటను దెబ్బ తీస్తుంది. ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఇప్పుడు అతను మళ్లీ కొత్తగా రీఎంట్రీ ఇచ్చినట్టు ఆడాలి.. అలా జరగాలంటే మానసికంగా పరిణతి రావాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. 

Rishabh Pant-Rohit Sharma

 2022లో ఆడిన 21 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 2 సార్లు మాత్రమే 30+ స్కోరు దాటగలిగాడు రిషబ్ పంత్. టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులాడిన సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 17 పరుగులు చేసిన పంత్, తొలి వన్డేలో 15 పరుగులకే అవుట్ అయ్యాడు. 

click me!