నాకు 365 రోజులు పట్టింది, నువ్వు మాత్రం... విరాట్ కోహ్లీ 49 వన్డే సెంచరీల రికార్డుపై సచిన్ టెండూల్కర్ స్పందన..

First Published | Nov 5, 2023, 7:27 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో విరాట్ కోహ్లీ సూఫర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. 8 మ్యాచుల్లో 108.6 యావరేజ్‌తో 543 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, క్వింటన్ డి కాక్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 

2023 వన్డే వరల్డ్ కప్‌లో 5 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, రెండు సెంచరీలతో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.. 500+ పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.. 

Sachin-Kohli-Rohit

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 49వ వన్డే సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. 

Latest Videos


తన రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీని ట్విట్టర్ ద్వారా అభినందించాడు సచిన్ టెండూల్కర్. ‘వెల్ ప్లేయిడ్ విరాట్. 49 నుంచి 50కి రావడానికి నాకు 365 రోజులు పట్టింది. నువ్వు కొద్ది రోజుల్లోనే 49 నుంచి 50కి వచ్చి నా రికార్డు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా... కంగ్రాట్స్...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్..
 

సచిన్ టెండూల్కర్ ఈ ఏడాదిలోనే 50వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి తనకు 365 పట్టిందనిఈ విధంగా ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.. 

sachin kohli

సౌతాఫ్రికాపై వరల్డ్ కప్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ. 2011లో సచిన్ టెండూల్కర్, 2015లో శిఖర్ ధావన్, 2019లో రోహిత్ శర్మ... సౌతాఫ్రికాపై వరల్డ్ కప్‌ సెంచరీలు చేశారు..

click me!