ధోనీ కంటే నాలుగేళ్ల ముందే 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యువరాజ్ సింగ్, టీమిండియా కెప్టెన్సీ వస్తుందని ఆశించాడు. అయితే టీమ్‌లో సీనియర్లు, మాహీకి ఓటు వేయడంతో యువీకి కెప్టెన్సీ చేసే ఛాన్స్ రాలేదు..
2007 టీ20 వరల్డ్ కప్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. 2011 టీ20 వరల్డ్ కప్‌లో 362 పరుగులు, 15 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా గెలిచాడు..
యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ ఆరంభంలో చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. యువీ మీద కూర్చొని ధోనీ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. యువీ, ధోనీ భుజాలపైకి ఎక్కి 2011 వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు..
అయితే తాము ఇద్దరం ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ కాదని అంటున్నాడు యువరాజ్ సింగ్. ‘నేను, మాహీ ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. మేం క్రికెట్ ఆడడం వల్ల ఫ్రెండ్స్ అయ్యాం అంతే. కలిసి ఆడాం..
నా లైఫ్ స్టైల్, మాహీ లైఫ్ స్టైల్ పూర్తిగా వేరు. అందుకే మేం ఇద్దరం ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్ కాలేదు. క్రికెట్ వల్ల కేవలం ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను, మాహీ గ్రౌండ్‌కి వెళితే 100 శాతం ఇస్తాం. అతను కెప్టెన్, నేను వైస్ కెప్టెన్‌ని..
మాహీ టీమ్‌లోకి వచ్చే సమయానికే నేను 4 ఏళ్ల సీనియర్‌ని. అయితే అతను కెప్టెన్ అయ్యాక, నాకు తనకీ కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయి. కొన్నిసార్లు నాకు నచ్చని నిర్ణయాలు తీసుకున్నాడు.
ఇంకొన్నిసార్లు నేను తీసుకున్న నిర్ణయాలు అతనికి నచ్చలేదు. ప్రతీ టీమ్‌లో ఇలాంటివి జరుగుతాయి. నా కెరీర్ చివర్లో ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ టీమ్‌లోకి వస్తానో తెలియక అతన్ని అడిగాను..
సెలక్టర్లు, నన్ను సెలక్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని మాహీ చెప్పాడు. అలాగైనా నాకు అసలు విషయం తెలిసింది. ఇది 2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందు తెలిసింది. టీమ్‌లో ఉన్నంతమాత్రాన బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలని లేదు..
ధోనీ గాయపడినప్పుడు అతనికి నేను బై రన్నర్‌గా ఉన్నా. అతను 90ల్లో ఉన్నప్పుడు సెంచరీ చేరుకునేలా చేశా. అతను అవుట్ కాకూడదని డైవ్ చేశా. నేను వరల్డ్ కప్ మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద ఉన్నప్పుడు మాహీ రెండు డాట్ బాల్స్ ఆడి, నా హాఫ్ సెంచరీ అయ్యేలా చేశాడు..
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో గౌతమ్ గంభీర్ అవుట్ అయితే నేను వెళ్లాలని ముందుగానే డిసైడ్ అయ్యింది. అలాగే విరాట్ అవుట్ అయితే ధోనీ వెళ్లాలని కూడా...
dhoni yuvi
అందులో అతని స్వార్థం ఏమీ లేదు. ఇంతకుముందు కలిసి చాలా పార్టీల్లో బాగా ఎంజాయ్ చేశాం..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..