మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, రేసులో నిలిచాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయి ఉంటే పాకిస్తాన్, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, శ్రీలంక కథ ముగిసి ఉండేది.
అయితే న్యూజిలాండ్ 401 పరుగులు స్కోరు చేసిన మ్యాచ్‌లో వర్షం వచ్చి, లక్కీగా పాకిస్తాన్‌ని గెలుపు వరించింది. దీంతో పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ ఫైట్ జరగనుంది..
పాకిస్తాన్, లీగ్ స్టేజీలో ఆఖరి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో సెప్టెంబర్ 11న కోల్‌కత్తాలో ఆడుతుంది. న్యూజిలాండ్, ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో నవంబర్ 9న బెంగళూరులో జరుగుతుంది.
న్యూజిలాండ్, శ్రీలంకపై 50 పరుగుల తేడాతో గెలిస్తే, పాకిస్తాన్.. కివీస్ నెట్ రన్ రేట్‌ని దాటాలంటే 180 పరుగుల తేడాతో నెగ్గాల్సి ఉంటుంది..
ఒకవేళ న్యూజిలాండ్ 1 పరుగు తేడాతో శ్రీలంకను ఓడిస్తే, పాకిస్తాన్, ఇంగ్లాండ్‌పై 131 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆఖరి రెండు లీగ్ మ్యాచుల్లో ఓడిపోవాలి. అప్పుడే పాకిస్తాన్ సెమీస్ చేరే ఛాన్సులు ఉంటాయి..
ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్, ఆఖరి రెండు లీగ్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సంచలన విజయాలు అందుకుంటే కథ వేరే ఉంటది!
అది కష్టం కాబట్టి ఇండియా, సౌతాఫ్రికాలతో ఆస్ట్రేలియా సెమీస్ వెళ్లడం దాదాపు ఖాయం కాగా మిగిలిన ప్లేస్ కోసం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.
ఒకవేళ శ్రీలంక చేతుల్లో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం ఇప్పటికే వరుస పరాజయాలతో పతనమైన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్ గెలిస్తే చాలు... సెమీస్ చేరుతుంది. ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు సెమీస్ బెర్త్ డిసైడర్లుగా మారాయి.