మరో 2 రోజుల్లో సౌతాఫ్రికా20 లీగ్... మినీ ఐపీఎల్‌కి ఆదరణ దక్కుతుందా...

First Published | Jan 8, 2023, 12:09 PM IST

సౌతాఫ్రికా బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న లీగ్ సౌతాఫ్రికా20. ఈ టోర్నీ కోసం రెండు సిరీస్‌లను కూడా వాయిదా వేసుకుంది సౌతాఫ్రికా. ఆర్థికంగా అనేక కష్టాలను ఎదుర్కొంటున్న సఫారీ బోర్డు, ఈ టీ20 లీగ్‌తో తమ కష్టాలన్నీ తీరిపోతాయని భావిస్తోంది...

పేరుకి సౌతాఫ్రికా20 లీగ్ అయినా ఇందులో టీమ్ అన్నీ ఐపీఎల్ ఫ్రాంఛైలవే... లక్నో సూపర్ జెయింట్స్‌ యజమాని ఆర్‌పీఎస్‌జీ గోయింకా గ్రూప్- దర్భన్ సూపర్ జెయింట్స్‌ టీమ్‌తో, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ జోబర్గ్ సూపర్ కింగ్స్ టీమ్‌తో, ముంబై ఇండియన్స్, ఎంఐ కేప్ టౌన్ టీమ్‌తో సౌతాఫ్రికా20 లీగ్‌లో బరిలో దిగుతున్నాయి...

రాజస్థాన్ రాయల్స్ టీమ్ పర్ల్ రాయల్స్ టీమ్‌తో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రెటోరియా క్యాపిటల్స్ టీమ్‌తో, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్‌ టీమ్‌తో సౌతాఫ్రికా20 లీగ్‌లో బరిలో దిగుతున్నాయి...


Rashid Khan

మినీ ఐపీఎల్‌గా మారిన ఈ సౌతాఫ్రికా20 లీగ్‌ సక్సెస్ కావాలంటే సఫారీ గడ్డపైనే కాకుండా ఇండియాలోనూ దీనికి ఆదరణ దక్కాలి. బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫారిన్ లీగ్స్‌కి ఎక్కడ పెద్దగా ఆదరణ దక్కలేదు...

Image Credit: PTI

అందుకే భారతీయులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో సౌతాఫ్రికా 20 లీగ్‌లో ఫ్రాంఛైజీలన్నీ ఐపీఎల్‌లో పాపులారిటీ తెచ్చుకున్న ప్లేయర్లకే కెప్టెన్సీ కట్టచెప్పాయి. డర్భన్స్ సూపర్ జెయింట్స్‌కి క్వింటన్ డి కాక్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

జోబర్గ్ సూపర్ కింగ్స్‌కి ఫాప్ డుప్లిసిస్ కెప్టెన్సీ చేస్తుంటే ఎంఐ కేప్ టౌన్‌కి రషీద్ ఖాన్ సారథిగా ఉన్నాడు. పర్ల్ రాయల్స్‌కి డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా ఉంటే ప్రెటోరియా క్యాపిటల్స్‌ని వేర్న్ పార్నెల్ సారథ్యం వహిస్తున్నాడు. సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్‌కి అయిడిన్ మార్క్‌రమ్ సారథిగా వ్యవహరించబోతున్నాడు..

సౌతాఫ్రికా 20 లీగ్‌కి పాపులారిటీ తెచ్చేందుకు ఆయా ఫ్రాంఛైజీలు, భారత క్రికెటర్లను కూడా పరోక్షంగా రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాయి.బర్గ్ సూపర్ కింగ్స్‌కి ధోనీని మెంటర్‌గా నియమించాలని సీఎస్‌కే ప్రయత్నించింది. అయితే బీసీసీఐ ఆమోద ముద్ర పడలేదు...

Latest Videos

click me!