ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా, అతని జాతకం మారిపోయేది! - గౌతమ్ గంభీర్

First Published Jan 8, 2023, 10:49 AM IST

ఐపీఎల్ 2023 మినీ వేలంలో చాలా మంది ఫారిన్ స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. లంక కెప్టెన్ దసున్ శనక కూడా ఐపీఎల్‌లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. మినీ వేలానికి ముందు ఇండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ జరిగి ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నాడు గౌతమ్ గంభీర్...

Image credit: PTI

మొదటి టీ20లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసిన దసున్ శనక, కీలక సమయంలో అవుట్ అయ్యాడు. శనక మరో రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ గెలిపించేవాడే...
 

రెండో టీ20లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన దసున్ శనక, శ్రీలంక తరుపున టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 2 కీలక వికెట్లు తీసి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు..
 

మూడో టీ20లో 17 బంతుల్లో 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన దసున్ శనక, 3 మ్యాచుల్లో 124 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. సూర్య ఈ సిరీస్‌లో 12 సిక్సర్లు బాదితే, శనక 11 సిక్సర్లు బాదాడు... 
 


సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో 175.26 స్ట్రైయిక్ రేటుతో 170 పరుగులు చేస్తే, దసున్ శనక 187.88 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. అక్షర్ పటేల్, రాహుల్ త్రిపాఠి మాత్రమే ఈ సిరీస్‌లో 190+ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేశారు...

Dasun Shanaka

‘ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటే, శనకని కొనుగోలు చేయడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కావు! శనక అంత భారీ ధర దక్కించుకుని ఉండేవాడు. శనక బ్యాటింగ్, బౌలింగ్ టాప్ క్లాస్...
 

ఎంత లేదన్నా దసున్ శనక రూ.8-10 కోట్లు దక్కించుకునేవాడు. మాతో పాటు కొన్ని ఫ్రాంఛైజీల దగ్గర అంత డబ్బు లేదు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్..  

click me!