IPL : ధోని టీమ్ కు భారంగా స్టార్ ఓపెనర్.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా సంజూ?

Published : Apr 24, 2026, 08:01 AM IST

IPL 2026 CSK captain : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా విఫలమవుతున్నారు. 7 మ్యాచుల్లో కేవలం 104 పరుగులు చేసి టోర్నీలోనే అత్యంత చెత్త ఓపెనర్‌గా చెత్త రికార్డు సృష్టించారు. జట్టుకు భారంగా మారాడు.

PREV
15
ముంబైపై సీఎస్కే గెలిచినా.. కెప్టెన్ ఆటపైనే హాట్ చర్చ

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ పోరులో చెన్నై జట్టు 103 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. జట్టు గెలిచినప్పటికీ, చెన్నై అభిమానులను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా రుతురాజ్ దారుణంగా విఫలమయ్యారు. కేవలం 14 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ కావడంతో సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్, ఓపెనర్‌గా వచ్చి పవర్‌ప్లేలో చేతులెత్తేయడం జట్టుకు మైనస్‌గా మారుతోంది.

25
ఐపీఎల్ 2026లో చెత్త ఓపెనర్ ఎవరు?

ఈ సీజన్‌లో అత్యంత చెత్తగా ఆడుతున్న ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ వేసిన బంతిని అంచనా వేయడంలో రుతురాజ్ విఫలం అయ్యాడు. తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. గత ఏడు ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే ఆయన ఆట తీరు చాలా దారుణంగా ఉంది. ఐపీఎల్ 2026లో ఆయన స్కోర్లు వరుసగా 6, 28, 7, 15, 7, 19, 22. కనీసం ఒక్క అర్థసెంచరీ కూడా చేయలేకపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

35
చెన్నై సూపర్ కింగ్స్‌కు భారంగా మారిన గైక్వాడ్

ఒకప్పుడు సీఎస్‌కే నమ్మదగ్గ బ్యాటర్‌గా ఉన్న రుతురాజ్, ఇప్పుడు జట్టుకు భారంగా మారారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో ఆయన కేవలం 14.86 సగటుతో 104 పరుగులు మాత్రమే చేశారు. ఆయన అత్యధిక స్కోరు కేవలం 28 పరుగులు కావడం గమనార్హం. గతంలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఆదుకున్న గైక్వాడ్, ఈసారి మాత్రం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. గణాంకాల ప్రకారం చూస్తే, రుతురాజ్ కెప్టెన్సీలో కొనసాగడంపై కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

45
గణాంకాల్లో అత్యల్ప సగటు ప్లేయర్లు ఎవరు?

ఐపీఎల్ 2026లో కనీసం 5 ఇన్నింగ్స్‌లు ఆడిన ఓపెనర్లలో అత్యల్ప సగటు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ టాప్ లో ఉన్నారు.

1. రుతురాజ్ గైక్వాడ్: 14.8 సగటు (104 పరుగులు)

2. ఫిన్ అలెన్: 16.2 సగటు (81 పరుగులు)

3. సాయి సుదర్శన్: 22.5 సగటు (135 పరుగులు)

4. పాతుమ్ నిస్సాంక: 22.7 సగటు (136 పరుగులు)

5. అజింక్య రహానే: 24.8 సగటు (124 పరుగులు)

రుతురాజ్ స్ట్రైక్ రేట్ కూడా 119.54 గానే ఉండటం ఆందోళన కలిగించే విషయం.

55
సీఎస్‌కే పగ్గాలు చేపట్టనున్న సంజూ శాంసన్?

రుతురాజ్ విఫలమవుతున్న తరుణంలో, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో సంజూ శామ్సన్ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. ఆయన ఆడిన 7 మ్యాచ్‌లలో 58.60 సగటుతో 293 పరుగులు చేశారు. ఇందులో రెండు అద్భుతమైన సెంచరీలు కూడా ఉన్నాయి. ఆయన అత్యధిక స్కోరు 115 నాటౌట్. 31 ఏళ్ల సంజూ ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో ముందున్నారు. వచ్చే సీజన్ నాటికి రుతురాజ్ స్థానంలో సంజూ సీఎస్‌కే కెప్టెన్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories