ఐపీఎల్‌ 2022పై ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్... జక్కన ఐదేళ్లు చెక్కిన సినిమా వసూళ్లపై కూడా...

Published : Mar 25, 2022, 12:20 PM IST

ఇండియన్స్‌కి ఉండే ప్రధానమైన రెండు కాలక్షేపాలు... ఒకటి సినిమా, రెండు క్రికెట్! రెండు ఒకేసారి వస్తే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ పరిస్థితి కూడా ఇదే. ఐదేళ్ల పాటు ఊరించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం కానుంది...

PREV
112
ఐపీఎల్‌ 2022పై ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్... జక్కన ఐదేళ్లు చెక్కిన సినిమా వసూళ్లపై కూడా...

‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్, ‘మెగా పవర్‌స్టార్’ రామ్‌చరణ్ లాంటి ఇద్దరు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తుండడంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి...

212

దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో, ‘దర్శక ధీర’ రాజమౌళి రూపొందించిన ‘రౌద్రం, రణం, రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమా... ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలయ్యింది...

312

మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ రావడంతో బాక్సాఫీస్ వసూళ్ల వర్షం ఖాయమని, ‘బాహుబలి’ మూవీతో భారత బాక్సాఫీస్‌కి కొత్త బెంచ్ మార్క్ డిసైడ్ చేసిన జక్కన్న, ఆ రికార్డులను ‘ఆర్ఆర్ఆర్’తో బద్ధలు చేయబోతున్నారని అంచనా వేస్తున్నారు సినీ క్రిటిక్స్...

412

అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి పోటీకి మరో భారీ సినిమాలేవీ థియేటర్లలో సందడి చేయకపోయినా... ఐపీఎల్ 2022 రూపంలో గట్టిపోటీ ఉండనుంది. ఐపీఎల్‌కి ఉండే క్రేజ్ కారణంగా చాలాచోట్ల మ్యాచులను లైవ్ టెలికాస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి...

512
RRR Movie

‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తీసి, ‘ఐపీఎల్’ మ్యాచులను వేసే అవకాశం లేకపోయినా... మూవీ కలెక్షన్లపై ఎంతో కొంతో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సౌత్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... శని, ఆదివారాల్లో మ్యాచులు ఆడబోతున్నాయి...

612

ఉదయం ఆట, మధ్యాహ్నం ఆటతో పోలిస్తే ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్లు భారీగా ఉంటాయి. అయితే ఈ సమయాల్లోనే ఐపీఎల్ మ్యాచులు ఆరంభం అవుతాయి. ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు సినిమాకి వెళ్లాలనే ఆలోచనను మానుకునేవాళ్లు చాలామందే ఉండొచ్చు...

712

అలాగే ఐపీఎల్‌ 2022 టీఆర్పీ రేటింగ్స్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ పడొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పోలిస్తే, ఐపీఎల్ మ్యాచులను తర్వాతైనా రీప్లే చూసుకోవచ్చు. అయితే లైవ్ మ్యాచ్ చూసే మజా వేరు...

812

మొత్తానికి ఈ రెండు వారాలు, ఐపీఎల్ వర్సెస్ ఆర్ఆర్ఆర్ పోటీ సాగనుంది. ఇందులో రెండూ గెలవచ్చు, కానీ కాస్తో కూస్తో కనిపించని ప్రభావం మాత్రం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు...

912

ఇంతకుముందు క్రికెట్ మ్యాచులు, ఐపీఎల్ కారణంగా సినిమాలపై, బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ‘బిగ్‌బాస్’ వంటి టీవీ రియాల్టీ షోలు, టీఆర్పీ కోసం నానా కష్టాలు పడాల్సి వచ్చింది...

1012

ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 ఫ్రాంఛైజీలు పోటీపడుతుండడంతో ఈసారి అంచనాలు భారీగానే ఉన్నాయి. అదీకాకుండా ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల రేట్లను భారీగా పెంచేశారు....
 

1112

ఇంతకుముందు రూ.10-రూ.20లకు వచ్చే టికెట్ ధర... ఇప్పుడు రూ.100 దాటేసింది. అంత పెట్టి సినిమా చూడడం కంటే, ఇంట్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచులు చూడొచ్చనే ఆలోచన మిడిల్ క్లాస్ జనానికి తప్పక వస్తుంది... 

1212


ఇన్ని అడ్డంకుల మధ్య ఐపీఎల్‌ 2022పై ఆర్ఆర్ఆర్ పైచేయి సాధించాలంటే... జక్కన్న మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర పనిచేయాల్సిందే... 

click me!

Recommended Stories