మాహీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో... కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా...

Published : Mar 25, 2022, 11:41 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ ఆరంభానికి కొన్ని గంటల ముందు మాహీ ఈ ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనయ్యారు...

PREV
18
మాహీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో... కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా...

12 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, 11 సార్లు ప్లేఆఫ్స్‌కి, 9 సార్లు ఫైనల్‌కి చేర్చాడు... నాలుగు సార్లు టైటిల్ గెలిచాడు...

28

మాహీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కే సారథిగా వ్యవహరించబోతున్నాడు...

38

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు ఎమ్మెస్ ధోనీ. అప్పటి నుంచే మాహీ, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది...

48

ఐపీఎల్ 2020 సీజన్‌ సెకండాఫ్ మ్యాచులు జరిగిన సమయంలో మాహీతో కలిసి ఫోటోలు దిగడానికి క్రికెటర్లు ఎగబడ్డారు. దీంతో మాహీ, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడేమోనని అనుమానాలు రేగాయి...

58

అయితే ఐపీఎల్ 2020 తనకి ఆఖరి సీజన్ కాదని ప్రకటించిన మాహీ... తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మళ్లీ అభిమానుల్లో అనుమానాలు రేగడానికి కారణమయ్యాడు...

68

కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడంటే, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటాడేమోనని ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్..

78

‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది పూర్తిగా మాహీ వ్యక్తిగత విషయం. ఆయన నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. ప్రాక్టీస్ సెషన్స్ మీటింగ్‌లో మాహీ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు....

88

జడేజాకి కెప్టెన్సీ ఇవ్వాలనేది కూడా మాహీ తీసుకున్న తీసుకున్న నిర్ణయమే. అయితే ఆయన ప్లేయర్‌గా కొనసాగుతాడు. మాహీకి ఇది ఆఖరి సీజన్ మాత్రం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్..

Read more Photos on
click me!

Recommended Stories