ఐపీఎల్‌లో మోస్ట్ సీనియర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ... ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే!

Published : Mar 25, 2022, 09:40 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఎమ్మెస్ ధోనీ. సీఎస్‌కే కెప్టెన్‌గా 12 సీజన్లు, రైజింగ్ పూణే కెప్టెన్‌గా ఓ సీజన్‌ ఆడిన మాహీ, సాధారణ ప్లేయర్‌గా ఐపీఎల్ 2022 సీజన్ ఆడబోతున్నాడు...

PREV
115
ఐపీఎల్‌లో మోస్ట్ సీనియర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ... ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే!

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 204 మ్యాచులు ఆడిన ఎమ్మెస్ ధోనీ, మోస్ట్ సీనియర్ కెప్టెన్‌గా ఉండేవాడు. 204 మ్యాచుల్లో 121 విజయాలు అందుకున్న మాహీ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గానూ ఉన్నాడు...

215

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ‘కెప్టెన్‌గా ఇదే ఆఖరి సీజన్’ అని ప్రకటించిన విషయం తెలిసిందే...

315

మాహీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంలో ఇప్పుడు ఆ రికార్డు రోహిత్ శర్మ ఖాతాలో వచ్చి చేరింది. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఇప్పటికే కెప్టెన్‌గా 129 మ్యాచులు ఆడి, గౌతమ్ గంభీర్‌తో సమంగా ఉన్నాడు.

415

విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంళూరుకి 140 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు... వీటిల్లో 64 విజయాలు అందుకున్నాడు.

515

కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్, తన ఐపీఎల్ కెరీర్‌లో 129 మ్యాచులకు సారథిగా వ్యవహరించి... అత్యధిక మ్యాచులకు కెప్టెన్సీ చేసిన మూడో ప్లేయర్‌గా ఉన్నాడు...

615

ఈ సీజన్‌తో అటు మోస్ట్ సీనియర్ కెప్టెన్‌గా మూడో స్థానంలో ఉన్న గౌతమ్ గంభీర్‌ను, ఇటు రెండో స్థానంలో ఉన్న  విరాట్ కోహ్లీని అధిగమించబోతున్నాడు రోహిత్...

715

రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యంత అనుభవం ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న అయ్యర్, ఇప్పటిదాకా 41 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు...

815

2020 సీజన్‌లో మొట్టమొదటిసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కి చేర్చిన శ్రేయాస్ అయ్యర్, ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి సారథిగా వ్యవహరించబోతున్నాడు...

915

శ్రేయాస్ అయ్యర్ తర్వాత అత్యంత అనుభవం ఉన్న మూడో ఐపీఎల్ కెప్టెన్ కేన్ విలియంసన్. 2018 సీజన్‌లో డేవిడ్ వార్నర్ గైర్హజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు కేన్ విలియంసన్...

1015

గత సీజన్‌లో డేవిడ్ వార్నర్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కేన్ విలియంసన్, ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 33 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు...

1115

రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, కేన్ విలియంసన్ తర్వాతి స్థానం కెఎల్ రాహుల్‌ది. గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్, కెప్టెన్‌గా 27 మ్యాచులు ఆడాడు... ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి సారథిగా వ్యవహరించబోతున్నాడు.

1215

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టిన యంగ్ వికెట్ కీపర్లు రిషబ్ పంత్ 16 మ్యాచులు, సంజూ శాంసన్ 14 మ్యాచులకు కెప్టెన్లుగా వ్యవహరించారు...
 

1315

గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నయా కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్, చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సారథి రవీంద్ర జడేజా... ఈ ఏడాది నుంచి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నారు...

1415

పంజాబ్ కింగ్స్‌ కొత్త సారథి మయాంక్ అగర్వాల్, గత ఏడాది కెఎల్ రాహుల్ కడుపు నొప్పితో తప్పుకోవడంతో ఓ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి, అందర్నీ ఇంప్రెస్ చేశాడు...

1515

కుర్రాళ్ల మధ్యలో మోస్ట్ సీనియర్ ఐపీఎల్ కెప్టెన్ రోహిత్ శర్మ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది...

Read more Photos on
click me!

Recommended Stories