అప్పుడు ఎమ్మెస్ ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి, ఇప్పుడు కెఎల్ రాహుల్‌ గొప్ప కెప్టెన్ అంటూ...

First Published Jan 22, 2022, 5:23 PM IST

రాజకీయాల్లోలాగే ఐపీఎల్‌లో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరు. మొన్నటిదాకా ముంబై ఇండియన్స్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు అహ్మదాబాద్ జట్టుకి కెప్టెన్‌గా మారాడు. అలాగే సీఎస్‌కే స్టార్ సురేష్ రైనాకి రిటెన్షన్‌లో చోటే దక్కలేదు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్లు చేరబోతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టును సొంతం చేసుకున్న ఆర్‌పీఎస్ గోయింకా సంస్థే, లక్నో జట్టును రూ.7090 కోట్లకు దక్కించుకుంది...

మెగా వేలానికి ముందే డ్రాఫ్ట్‌ల రూపంలో కెఎల్ రాహుల్‌ను రూ.17 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో ఫ్రాంఛైజీ, అతనితో పాటు మార్నస్ స్టోయినిస్, రవి భిస్ణోయ్‌లను కొనుగోలు చేసింది...

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకోబోతున్న కెప్టెన్‌గా ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేయబోతున్నాడు కెఎల్ రాహుల్...

గత రెండు సీజన్లలో మయాంక్ అగర్వాల్, మహ్మద్ షమీ, నికోలస్ పూరన్, క్రిస్ గేల్ వంటి స్టార్లతో నిండిన పంజాబ్ కింగ్స్ జట్టును కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేర్చలేకపోయాడు కెఎల్ రాహుల్...

బ్యాటింగ్‌లో పరుగులు చేసినా, జట్టును సమిష్టిగా విజయం వైపు నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. భారత జట్టు కెప్టెన్‌గానూ అదే చెత్త కెప్టెన్సీతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు...

అలాంటి కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు లక్నో ఫ్రాంఛైజీ జట్టు యజమాని ఆర్‌పీ సంజీవ్ గోయింకా...

‘కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీ స్కిల్స్‌ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతను కెప్టెన్‌గా లక్నో టీమ్‌ను విజయపథంలో నడిపిస్తాడని పూర్తి నమ్మకంతో ఉన్నాం...’ అంటూ కామెంట్ చేశాడు లక్నో యజమాని సంజీవ్ గోయింకా...

అయితే ఇదే సంజీవ్ గోయింకా గ్రూప్, ఐపీఎల్ 2016 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చలేకపోయాడనే కారణంగా ఎమ్మెస్ ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది...

2016 సీజన్‌లో గ్రూప్ స్టేజ్‌లో 9 మ్యాచుల్లో ఓడిన రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ జట్టు, 5 మ్యాచుల్లో గెలిచి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో 2017 సీజన్‌లో మాహీని కెప్టెన్‌గా తప్పించి, స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చింది ఆర్‌పీఎస్...

2017 సీజన్‌లో పూణే సూపర్ జెయింట్, ఫైనల్‌ చేరింది. అయితే అప్పుడు కూడా స్టీవ్ స్మిత్ పేపర్ కెప్టెన్‌గా వ్యవహరించాడని మహేంద్ర సింగ్ ధోనీయే వెనకుండి అంతా నడిపించాడనేది అందరికీ తెలిసిన విషయమే..

ఒక్క సీజన్‌ ఫెయిల్యూర్‌కే ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నచ్చలేదని తీసి పక్కనబెట్టిన ఆర్‌పీఎస్ గ్రూప్‌కి, రెండు సీజన్లలో ఫెయిలై, అసలు కెప్టెన్సీ స్కిల్స్‌ లేవని విమర్శలు తెచ్చుకుంటున్న కెఎల్ రాహుల్‌లో గొప్ప కెప్టెన్ కనిపించడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు అభిమానులు...

click me!