ఆ ఇద్దరూ అవుటైతే అంతే, మిగిలిన వాళ్లు ఉత్తుత్తి ప్లేయర్లే... టీమిండియాపై పాక్ ప్లేయర్ షాకింగ్ కామెంట్లు...

First Published Jan 22, 2022, 4:21 PM IST

ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారి టీమిండియాపై విజయాన్ని అందుకోగలిగింది పాకిస్తాన్. భారత జట్టు రాత బాగోలేకనే, వాళ్ల అదృష్టం కలిసి వచ్చో దక్కిన ఆ విజయాన్ని చూసి తెగ విర్రవీగుతున్నారు పాక్ ప్లేయర్లు...

తాజాగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్, భారత జట్టుపై కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాని 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, విజయాన్ని అందుకుంది పాకిస్తాన్...

టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీలోనూ టీమిండియా, తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడనుంది. మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 23న మధ్యాహ్నం 1.30కి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది...

‘ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే టీమిండియా కంటే పాకిస్తాన్ చాలా బాగా ఆడుతోంది. వారి ఆటతీరు రోజురోజుకీ మరింత మెరుగవుతోంది...

భారత జట్టు ఆట అయితే రోజురోజుకీ దిగజారుతున్నట్టే కనిపిస్తోంది. నా ఉద్దేశంతో టీమిండియాకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... ఈ ఇద్దరే కీ ప్లేయర్లు...

ఏ మ్యాచ్ అయినా ఈ ఇద్దరూ సరిగా రాణించడంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ త్వరగా అవుటైతే, మిగిలిన ప్లేయర్లు పెద్దగా రాణించలేరు...

అలాగని టీమిండియాలోని మిగిలిన ప్లేయర్లను తక్కువ చేయడం లేదు. వారిలో టాలెంట్ ఉంది, అయితే రోహిత్, విరాట్ లాంటి సీనియర్లు త్వరగా అవుటైతే ఆ ప్రెషర్‌ను మిగిలిన బ్యాట్స్‌మెన్ మోయలేరు...

అలాంటి సమయాల్లో వారి ఆటతీరు ఉత్తుత్తి ప్లేయర్లలానే ఉంటుంది. ఇంతకుముందులా టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ లాంటి ప్లేయర్లు లేరనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి...

ఈసారి కూడా వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ గెలవాలని, గెలుస్తుందనే నేను అనుకుంటున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ హఫీజ్...

41 ఏళ్ల మహ్మద్ హఫీజ్, 2009 టీ20 వరల్డ్‌కప్ మినహా ప్రతీ పొట్టి ప్రపంచకప్ టోర్నీలోనూ పాకిస్తాన్ తరుపున బరిలో దిగాడు. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు...

అయితే 2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తాను ప్లేయర్‌గా ఉన్న సమయంలో భారత జట్టుపై విజయం సాధించడం చాలా సంతృప్తినిచ్చిందని వ్యాఖ్యానించాడు మహ్మద్ హఫీజ్... 

click me!