మార్చి 27 నుంచే ఐపీఎల్ 2022... వీలైతే ఇక్కడే, లేదంటే ఆ మూడు దేశాల్లో....

First Published Jan 22, 2022, 4:47 PM IST

ఐపీఎల్ 2022 మహా సమరానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వేల కోట్ల ఈ క్రికెట్ క్యాష్ లీగ్‌ను ఎక్కడ, ఎలా నిర్వహించాలనే దానిపై ఇప్పటి నుంచి విస్తృతమైన చర్చ జరుగుతోంది...

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కొత్తగా చేరిన రెండు జట్లతో కలిపి 10 ఫ్రాంఛైజీలతో సమావేశం ఏర్పాటు చేయనుంది బీసీసీఐ...

ఈ సమావేశంలో ఐపీఎల్ 2022 మెగా వేలం జరిగే తేదీ, ప్రదేశంతో పాటు లీగ్ మ్యాచుల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయబోతున్నారు భారత క్రికెట్ బోర్డు పెద్దలు...

10 జట్లు చేరడంతో డబుల్ హెడర్ మ్యాచులను తగ్గించేందుకు వీలుగా ఏప్పిల్ 2 నుంచి కాకుండా మార్చి 27 నుంచే ఐపీఎల్ 2022 సీజన్ మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి...

కరోనా థర్డ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించడం వీలయ్యే పనేనా? కాదా? అనే విషయంపై అధ్యయనం చేస్తున్నారు బీసీసీఐ పెద్దలు...

ఒకవేళ కరోనా కేసులు తగ్గుముఖం పడితే మహారాష్ట్రలోని ముంబైలో ఐపీఎల్ 2022 సీజన్ మొదటి మ్యాచ్ జరుగుతుంది... 

ముంబైతో పాటు మహారాష్ట్రలో (పూణే) సీజన్ మొత్తం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనే ఆలోచనలు చేస్తోంది బీసీసీఐ...

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో ఇలాంటి ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు. బయో బబుల్‌ జోన్‌లో కరోనా కేసులు వెలుగుచూడడంతో సీజన్‌ని మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది...

ఫిబ్రవరి రెండో వారానికి కరోనా కేసులు తగ్గకపోతే, ఈసారి యూఏఈలోనే ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోందట బీసీసీఐ... అక్కడ పరిస్థితిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు భారత క్రికెట్ బోర్డు సభ్యులు...

ఒకవేళ యూఏఈలో వీలుకాకపోతే, సౌతాఫ్రికా వేదికగా మ్యాచులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యూఏఈలో మాదిరిగానే సౌతాఫ్రికాలో మ్యాచుల సమయం కూడా భారత్‌కి అనుకూలంగా ఉంటుందని ఈ ఆలోచన చేస్తోంది బీసీసీఐ..

యూఏఈ, సౌతాఫ్రికాలలో వీలుకాకపోతే ఆఖరి మార్గంగా శ్రీలంక వైపు చూస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఇప్పటికే ఐపీఎల్‌కి వేదిక నిచ్చేందుకు అన్ని దేశాలు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి... శ్రీలంక అయితే టైమింగ్‌తో పాటు అన్నీ ఇక్కడున్నట్టే ఉంటాయి...

click me!