తినడానికి డబ్బులు లేక రెండు పూటలా పస్తులు... రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్ సక్సెస్ స్టోరీ వెనక...

First Published Jan 29, 2021, 3:47 PM IST

ఒకప్పుడు బస్సు టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేని నట్టూ, ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత టీమిండియాలో స్టార్‌గా మారిపోయాడు. అలాగే బిగ్‌బాష్ లీగ్ కారణంగా క్రికెట్ ప్రపంచం దృష్టిలో పడిన ఓ ఆసీస్ యంగ్ ప్లేయర్, ఇలాంటి కష్టాలెన్నో అనుభవించాడట. అతనే జోష్ లిఫిప్...

జోష్ ఫిలిప్... గత ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున బరిలో దిగిన యంగ్ ఆసీస్ ప్లేయర్.
undefined
ఈ ఆస్ట్రేలియా యంగ్ వికెట్ కీపర్‌ని రూ.20 లక్షల కనీస ప్రైజ్‌కి కొనుగోలు చేసింది ఆర్‌సీబీ.
undefined
ఐపీఎల్‌ 2020 సీజన్‌లో కేవలం 5 మ్యాచులు ఆడిన ఫిలిప్... 78 పరుగులు చేశాడు.
undefined
అయితే బిగ్‌బాష్ లీగ్ 2021 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు జోష్ ఫిలిప్...
undefined
బీబీఎల్ గత సీజన్‌లో 487 పరుగులు చేసిన జోష్ ఫిలిప్.... అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...
undefined
ఈ 22 ఏళ్ల యంగ్ వికెట్ కీపర్... తన క్రికెట్ ప్రస్థానంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు...
undefined
‘న్యూకాస్టల్ క్రికెట్ క్లబ్ కోసం క్రికెట్ ఆడేందుకు యూకే వెళ్లాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. ఇంటి నుంచి వేల మైలు వెళ్లిన తర్వాత సొంతంగా బతకడం ఎంత కష్టమో తెలిసింది...
undefined
క్రికెట్ ఆడడమే నాకు తెలిసిన విద్య.. దేశం తరుపున క్రికెట్ ఆడాలనేదే నా కల.. అందుకే అన్నింటినీ భరించాను. నాకో వేరే ఆప్షన్ కూడా లేకుండా పోయింది..
undefined
నా జేబులో పట్టుకుని 20 పౌండ్లు కూడా ఉండేవి కావు. ఎంతో కష్టపడితే కానీ ఓ పూట భోజనం దొరికేది కాదు... ఈ కష్టాల నుంచి బయటపడాలంటే క్రికెట్‌లో సత్తా చాటాల్సిందే...
undefined
ఇప్పుడు నేను ఉన్న పరిస్థితికి అదే కారణం... నేను ఫెయిల్ అయినా జడ్జి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. నాకు నేను... నాకున్న పెద్ద అడ్వాంటేజ్ అదే... ’ అంటూ చెప్పుకొచ్చాడు జోష్ ఫిలిప్.
undefined
న్యూకాస్టల్ క్రికెట్ క్లబ్ తరుపున 60 సగటుతో దాదాపు 13 వేల పరుగులు చేసిన జోష్ ఫిలిప్... త్వరలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు.
undefined
జోష్ ఫిలిప్ ఆటతీరును బిగ్‌బాష్ లీగ్‌లో గమనించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మినీ వేలానికి అతన్ని విడుదల చేయకుండా అట్టిపెట్టుకుంది...
undefined
click me!