మాస్టర్ ప్లాన్‌తో వచ్చిన కోహ్లీసేన... కొడితే దెబ్బకి కప్పు వచ్చి చేతిలో పడాల్సిందే...

Published : Apr 23, 2021, 03:37 PM ISTUpdated : Apr 23, 2021, 06:02 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ప్రతీ సీజన్‌కి ముందు ‘ఈ సాల్ కప్ నమ్ దే’ అంటూ చేసే హడావుడి అంతా ఇంకా కాదు. సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలుస్తాడని ఆశపడడం, ఆ తర్వాత నిరాశపడడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి మాత్రం కప్పు కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయి వచ్చినట్టుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

PREV
115
మాస్టర్ ప్లాన్‌తో వచ్చిన కోహ్లీసేన... కొడితే దెబ్బకి కప్పు వచ్చి చేతిలో పడాల్సిందే...

ఎప్పటిలాగే ఐపీఎల్ 2021 సీజన్‌లో కోట్లు కుమ్మరించి ప్లేయర్లను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో పెద్దగా పర్ఫామెన్స్ చేయని గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి ఏకంగా రూ.14 కోట్ల 25 లక్షలు పోసి కొనుగోలు చేసింది.

215

పెద్దగా క్రికెట్ ఆడిన అనుభవం లేని కేల్ జెమ్మీసన్‌ కోసం ఏకంగా రూ.15 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది. 37 ఏళ్ల సీనియర్ ప్లేయర్ డానియల్ క్రిస్టియన్ కోసం కూడా రూ.4 కోట్ల 80 లక్షలు పెట్టడం చూసి అందరూ అవాక్కయ్యారు.

315

అయితే ఐపీఎల్ 2021 మొదటి నాలుగు మ్యాచుల్లో ఛాంపియన్ తరహా ఆటతీరు చూపించింది రాయల్ ఛాలెంజర్స్. మొదటి మ్యాచ్‌లో ముంబైని ఓడించినప్పుడు కూడా ఆర్‌సీబీ ఇలా పర్ఫామ్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

415

160 పరుగుల ఈజీ లక్ష్యాన్ని చేధించడానికి 20 ఓవర్లు పూర్తిగా వాడుకుని, ఆఖరి బంతికి చచ్చీ పడి విజయాన్ని అందుకుంది. బోణీ కొట్టినా, ఇలాంటి పర్ఫామెన్స్‌తో ఆడితే మాత్రం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేరని విమర్శలు వచ్చాయి...

515

అయితే ప్రతీ మ్యాచ్‌కి మెరుగు అవుతూ వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి మూడు మ్యాచుల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్ అదరగొట్టగా నాలుగో మ్యాచ్‌లో వారి అవసరం కూడా రాలేదు.

615

178 పరుగుల భారీ టార్గెట్‌ను యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ కలిసి ఊదేశారు. కుర్రాడే అయినా భారీ హిట్టర్లకు సమానంగా బౌండరీల మోత మోగించాడు దేవ్‌దత్ పడిక్కల్...

715

గత సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన దేవ్‌దత్ పడిక్కల్, మొదటి మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అయితే అతని స్ట్రైయిక్ రేటు వన్డే ప్లేయర్‌లా ఉందని విమర్శలు వచ్చాయి. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు పడిక్కల్...

815

ఈ విమర్శలపైన పూర్తిగా ఫోకస్ పెట్టిన దేవ్‌దత్ పడిక్కల్... రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌లో తనలోని భారీ హిట్టర్‌ను పరిచయం చేశాడు. అంతకుముందు జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో చేసిన పరుగులు, పడిక్కల్‌కి ఐపీఎల్‌లో బాగా హెల్ప్ అయ్యాయి. 

915

బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడినా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన హర్షల్ పటేల్... ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అదరగొడుతున్నాడు...

1015

ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్, నాలుగు మ్యాచుల్లో 12 వికెట్లు తీసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు..

1115

గత సీజన్ నుంచి అద్భుతమైన బౌలింగ్ పర్ఫామెన్స్ ఇస్తున్న హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ అయితే సీజన్‌లో 50 డాట్ బాల్స్ వేసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

1215

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే షాబజ్ అహ్మద్ రెండు ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చేశాడు...

1315

వీరితో పాటు యజ్వేంద్ర చాహాల్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆర్‌సీబీకి కావాల్సింది రూ.15 కోట్లు పెట్టి కొన్న జెమ్మిసన్ నుంచి ఆరెంజ్ ప్రదర్శన మాత్రమే. అతను కూడా ఫామ్‌లోకి వస్తే, ఈ సాలా కప్ గెలవడం ఆర్‌సీబీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

1415

ఇప్పటికే ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన తర్వాతి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతోంది.

1515

ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సీఎస్‌కే విజయం సాధిస్తే... ఆర్‌సీబీ ఉత్సాహం రెట్టింపు కావడం ఖాయం. మరి ఆ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాలను కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.

click me!

Recommended Stories