RCBvsDC: ఆర్‌సీబీ ఉత్కంఠ విజయం... ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్...

Published : Apr 27, 2021, 11:28 PM IST

ఒక్క పరుగు... ఒకే ఒక్క పరుగు... ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి విజయాన్ని దూరాన్ని చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ పోరాడినా... సిమ్రాన్ హెట్మయర్ చాలా రోజుల తర్వాత సిక్సర్లతో విరుచుకుపడినా విజయానికి అడుగు దూరంలో వచ్చి నిలిచిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులకి పరిమితమైంది.

PREV
18
RCBvsDC: ఆర్‌సీబీ ఉత్కంఠ విజయం... ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్...

172 పరుగుల భారీ లక్ష్యచేధనతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను జెమ్మీసన్ అవుట్ చేశాడు. భారీ షాట్‌కి యత్నించిన ధావన్, చాహాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

28

ఆ తర్వాత కొద్దిసేపటికే 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటు అంచును తాకుతూ వెళ్లిన బంతిని ఏబీడీ ఒడిసిపట్టుకున్నాడు.

38

18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన పృథ్వీషా... హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

48

మార్కస్ స్టోయినిస్, రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్‌కి 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 17 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన స్టోయినిస్‌ను హర్షల్ పటేల్ అవుట్ చేశాడు...

58

18 బంతుల్లో 46 పరుగులు కావాల్సిన దశలో జెమ్మిసన్ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన హెట్మయర్... 21 పరుగులు రాబట్టాడు. దీంతో విజయానికి ఆఖరి 2 రెండో ఓవర్లలో 25 పరుగులు కావాల్సిన స్థితికి వచ్చేసింది.

68

హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో రిషబ్ పంత్ ఫోర్ బాదడంతో 11 పరుగులు రాగా విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

78

సిరాజ్ వేసిన 20వ ఓవర్‌ మొదటి రెండు బంతులకు సింగిల్స్ రాగా మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి రెండు పరుగులు తీశాడు రిషబ్ పంత్. ఐదో బంతికి ఫోర్ రాగా ఆఖరి బంతికి సిక్సర్ కావాల్సిన దశలో పంత్ ఫోర్ బాదినా...  పరుగు తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది.

88

హెట్మయర్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేయగా 48 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు హెట్మయర్... ఆర్‌సీబీ 2021 సీజన్‌లో ఐదో విజయాన్ని అందుకుని టాప్‌లోకి దూసుకెళ్లింది.

click me!

Recommended Stories