టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మొదటి వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ. అయితే 11 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని, ఆవేశ్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
విరాట్ కోహ్లీ అవుటైన తర్వాతి బంతికే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు దేవ్‌దత్ పడిక్కల్. 14 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్ అవుట్ కావడంతో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ...
20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్.
రజత్ పటిదార్, ఏబీ డివిల్లియర్స్ కలిసి నాలుగో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రజత్ పటిదార్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
9 బంతుల్లో 6 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, రబాడా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ అవుట్ కాగా ఏబీ డివిల్లియర్స్ మరోసారి హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆదుకున్నాడు...
ఐపీఎల్ కెరీర్‌లో 40వ హాఫ్ సెంచరీ బాదిన ఏబీ డివిల్లియర్స్, 5 వేల ఐపీఎల్ పరుగులు పూర్తిచేసుకున్నాడు. స్టోయినిస్ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన ఏబీ డివిల్లియర్స్, ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు ఏబీ డివిల్లియర్స్...