అవన్నీ తప్పుడు వార్తలు, ఆడేందుకు వచ్చాం... ఐపీఎల్ ముగిసేవరకూ ఇక్కడే ఉంటాం...

First Published Apr 27, 2021, 8:41 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమైన తర్వాత కొందరు ఫారిన్ క్రికెటర్లు, బయో బబుల్ సెక్యూలర్ జోన్‌లో ఉండడం ఇష్టం లేక ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉండలేక ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై వంటి ప్లేయర్లు కూడా స్వదేశానికి పయనమయ్యారు.

ముగ్గురు ప్లేయర్లు ఇలా అర్ధాంతరంగా స్వదేశానికి బయలుదేరి వెళ్లడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, భారత్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఆడడానికి ఇక్కడికి వచ్చిన ఆసీస్ ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారని, తిరిగి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి.
undefined
అదీకాకుండా ఆస్ట్రేలియా, భారత్‌ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో... ఇక్కడ ఇరుక్కుపోయిన ఆసీస్ ప్లేయర్లు, తమ దేశానికి ఎలా తిరిగి వెళ్లాలో తెలియక గందరగోళానికి గురి అవుతున్నారని టాక్ వినిపించింది.
undefined
అయితే ఈ వార్తలు కేవలం వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది క్రికెట్ ఆస్ట్రేలియా... ‘ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు, ఆందోళన చెందుతున్నారని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు.
undefined
మేం ఐపీఎల్ ఆడడానికి ఇక్కడి వచ్చాం. సీజన్ మొత్తం ముగిశాకే స్వదేశానికి వెళతాం. కష్ట సమయంలో భారత్‌కి అండగా ఉండాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది... మరీ అనుకోని విధంగా విపత్తు సంభవిస్తే తప్ప, ఎక్కడికి వెళ్లేది లేదు’ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలియచేశాయి.
undefined
భారత్‌లో కరోనా విపత్తు కారణంగా ఆక్సిజన్ దొరకక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునే ఉద్దేశంతో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్, 50 వేల డాలర్లు ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా అందచేయగా, బ్రెట్ లీ కూడా రూ.43 లక్షలు విరాళమిచ్చాడు.
undefined
ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చేందుకు క్రికెటర్లు, తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలని, అది తమ డ్యూటీ కాదని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్..
undefined
అయితే బీసీసీఐ మాత్రం విదేశీ ప్లేయర్ల భద్రతపై పూర్తి హామీ ఇచ్చింది. ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన క్రికెటర్లను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తమదేనంటూ భరోసానిచ్చింది భారత క్రికెట్ బోర్డు...
undefined
click me!