టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ మరో గొప్ప రికార్డు - దిగ్గజ కెప్టెన్లు వెనక్కి

First Published Sep 14, 2024, 12:20 PM IST

Rohit Sharma's Test cricket records: సెప్టెంబర్ 19 నుండి భార‌త క్రికెట్ జ‌ట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు టెస్టు మ్యాచ్ ల ఈ సిరీస్ తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు 16 టెస్టు మ్యాచ్‌ల్లో 10 విజయాలు అందుకుంది. 
 

Rohit Sharma's Test cricket records:  భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో అద్భుత రికార్డును సృష్టించ‌నున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. 

భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియం వేదిక కానుంది. ఇక రెండో టెస్టు కాన్పూర్‌లో జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఎలాగైనా విజయం సాధించాల‌ని వ్యూహాలు సిద్ధం చేసుకుంది.

ఈ టెస్టు సిరీస్ లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ గొప్ప రికార్డును బద్దలు కొట్టడం ద్వారా ప్రపంచ క్రికెట్‌లో త‌న‌దైన ముద్ర‌ను మ‌రోసారి వేయనునున్నాడు. 

Latest Videos


టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించగలడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో 40 టెస్టు మ్యాచ్‌లలో టీమ్‌ఇండియా విజయాన్ని అందుకుంది. 

ఇక రోహిత్ శర్మ ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచ్‌లకు టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 10 టెస్టు మ్యాచ్‌లు గెలిచింది. ఈ సమయంలో టీమిండియా 4 టెస్టు మ్యాచ్‌లు ఓడిపోగా, రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అయ్యే బంగ్లాదేశ్‌-భార‌త్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ త‌ర్వాత టీం ఇండియా అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ఈ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ను గెలిపిస్తే, కెప్టెన్‌గా మహ్మద్ అజహరుద్దీన్ గొప్ప రికార్డును బద్దలు కొడ‌తాడు. 

టెస్టు కెప్టెన్‌గా భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన విషయంలో రోహిత్ శర్మ మహ్మద్ అజారుద్దీన్‌ను దాటేస్తాడు.  బంగ్లాదేశ్-న్యూజిలాండ్‌లతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో క్లీన్ స్వీప్ చేయడంతో రోహిత్ శర్మ అతని కెప్టెన్సీలో 15 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి మహ్మద్ అజారుద్దీన్‌ను అధిగమించనున్నాడు.

rohit sharma

మహ్మద్ అజారుద్దీన్ 47 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అయితే, అత‌ని సారథ్యంలో భారత్ 14 టెస్టు మ్యాచ్‌లు గెలిచింది. ఈ సమయంలో టీమిండియా 14 టెస్టు మ్యాచ్‌లు ఓడిపోగా, 19 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌కు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అత‌ని కెప్టెన్సీలో40 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ విజ‌యం సాధించింది.

విరాట్ కోహ్లీ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ధోనీ 60 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిగా, టీమిండియా 27 మ్యాచ్‌లు గెలిచింది. ఇక సౌరవ్ గంగూలీ 47 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించగా, 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు.

భారత్ తరఫున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే 

1. విరాట్ కోహ్లీ - 68 టెస్టు మ్యాచ్‌ల్లో 40 విజయాలు

2. మహేంద్ర సింగ్ ధోని – 60 టెస్ట్ మ్యాచ్‌ల్లో 27 విజయాలు

3. సౌరవ్ గంగూలీ – 49 టెస్టు మ్యాచ్‌ల్లో 21 విజయాలు

4. మహ్మద్ అజారుద్దీన్ - 47 టెస్టు మ్యాచ్‌ల్లో 14 విజయాలు

5. రోహిత్ శర్మ - 16 టెస్టు మ్యాచ్‌ల్లో 10 విజయాలు

6. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – 40 టెస్ట్ మ్యాచ్‌ల్లో 9 విజయాలు

7. సునీల్ గవాస్కర్ – 47 టెస్టు మ్యాచ్‌ల్లో 9 విజయాలు

8. రాహుల్ ద్రవిడ్ - 25 టెస్ట్ మ్యాచ్‌ల్లో 8 విజయాలు

click me!