9 దేశాలపై టెస్ట్ సెంచరీలు సాధించిన ప్లేయ‌ర్లు - వీరిలో ఇద్ద‌రు భార‌త క్రికెట‌ర్లు

First Published | Sep 14, 2024, 11:58 AM IST

test centuries against 9 countries: క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ఘనత సాధించిన అనేక మంది బ్యాట్స్‌మెన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే టీ20, వన్డేలతో పోలిస్తే టెస్టు క్రికెట్‌లో సెంచరీలు చేయ‌డం గొప్ప‌గా భావిస్తారు. అలాంటిది 9 దేశాల‌పై సెంచరీలు చేసి అద్వితీయ రికార్డు సృష్టించిన క్రికెటర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 
 

test centuries against 9 countries: ప్రపంచ క్రికెట్ లో ఇప్పటివరకు కేవలం 14 మంది బ్యాట్స్‌మెన్లు మాత్రమే టెస్టు మ్యాచ్‌ల్లో 9 దేశాలపై సెంచరీలు సాధించగలిగారు. ఈ లిస్టులో భార‌త బ్యాట‌ర్లు కూడా ఉన్నారు. ఈ జాబితాలో శ్రీలంక నుండి నలుగురు, ఇండియా నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుండి ముగ్గురు, దక్షిణాఫ్రికా నుండి ఇద్దరు, వెస్టిండీస్ నుండి ఒకరు, న్యూజిలాండ్, పాకిస్తాన్ నుంచి ఒక్క‌రు చొప్పున‌ ఉన్నారు.

ఈ జాబితాలో ఉన్న ఇద్దరు యాక్టివ్ ప్లేయర్‌లు

9 దేశాల‌పై టెస్టు సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ల‌ జాబితాలో ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఇందులో మొదటి క్రికెట‌ర్ శ్రీలంక సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ కాగా, రెండో పేరు న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 9 దేశాలతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించారు.

Latest Videos


లారా నుంచి గిల్‌క్రిస్ట్-సంగక్కర వ‌ర‌కు

9 దేశాల‌పై టెస్టు సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ల‌ జాబితాలో  లారా-గిల్‌క్రిస్ట్, సంగక్కర వంటి లెజెండ్ ప్లేయ‌ర్లు ఉన్నారు. వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా, శ్రీలంక గ్రేట్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర, ఆస్ట్రేలియా గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

వీరితో పాటు దక్షిణాఫ్రికా వెటరన్ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా, రికీ పాంటింగ్, పాకిస్థాన్‌కు చెందిన యూనిస్ ఖాన్ కూడా 9 దేశాలపై టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించారు.

Image credit: ICCFacebook

భారత్ నుంచి ఇద్ద‌రు ప్లేయ‌ర్లు 

9 దేశాల‌పై టెస్టు సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ల‌ జాబితాలో  భార‌త్ కు చెందిన ఇద్ద‌రు ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లు ఈ లిస్టులో చోటుసంపాదించారు. సచిన్ టెండూల్కర్ పేరిట 51 టెస్టు సెంచరీలు ఉన్నాయి. ఇది ప్రపంచం క్రికెట్ లో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన ఘ‌న‌త కూడా స‌చిన్ పేర‌టి ఉంది. అలాగే, రాహుల్ ద్రవిడ్ తన టెస్ట్ కెరీర్‌లో 36 సెంచరీలు చేశాడు.

సచిన్ టెండూల్కర్ టెస్టు సెంచరీలు సాధించిన 9 దేశాల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. అలాగే, రాహుల్ ద్రవిడ్ కూడా ఈ 9 దేశాలపై టెస్టు సెంచరీలు సాధించాడు.

కాగా, క్రికెట్ లెజెండ్, గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు సాధించిన టీమిండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అనేక రికార్డులు సృష్టించారు. త‌న క్రికెట్ కెరీర్ లో స‌చిన్ ఏకంగా 100 సెంచ‌రీలు బాదాడు. టెస్టుల్లో 51, వ‌న్డేల్లో 49 సెంచ‌రీలు కొట్టాడు. 

click me!