India Squad For SA T20I: టీమిండియా సారథి రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత చెత్త ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ఈ వైఫల్యాల నుంచి తేరుకోవడానికి తనకు కొంత సమయమివ్వాలని అతడు కోరుకుంటున్నాడు.
ఐపీఎల్-15 ముగిసిన పది రోజులకు దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్నది. టీమిండియాతో సఫారీలు ఐదు టీ20లు ఆడనున్నారు. ఇది ముగిశాక భారత జట్టు ఐర్లాండ్ కు వెళ్లి అట్నుంచి అటే ఇంగ్లాండ్ కు వెళ్లాల్సి ఉంది. అయితే దక్షిణాఫ్రికా సిరీస్ కు తాను అందుబాటులో ఉండలేనని.. తనకు కొన్నాళ్లు విశ్రాంతినివ్వాలని టీమిండియా సారథి రోహిత్ శర్మ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి విన్నవించినట్టు వార్తలు వస్తున్నాయి.
29
దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్, ఐర్లాండ్ టూర్ ల నుంచి తనకు విశ్రాంతి కల్పించాలని జులైలో జరుగబోయే ఇంగ్లాండ్ పర్యటన వరకు తాను తిరిగి జట్టుతో చేరుతానని హిట్ మ్యాన్ సెలెక్టర్లకు చెప్పాడట. దీంతో సెలెక్టర్లకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.
39
ఇదే విషయమై బీసీసీఐ కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘అవును. రోహిత్ శర్మ కొన్నాళ్లు విశ్రాంతి కోరుకుంటున్నాడు. అది అర్థం చేసుకోదగినదే. ఈ సీజన్ లో అతడు ముంబై ఇండియన్స్ తరఫున అన్ని మ్యాచులు ఆడాడు. అతడి జట్టు అనుకున్న మేర రాణించలేదు. దానిని మేము అర్థం చేసుకుంటున్నాం.
49
Image Credit: Getty Images
ఇంగ్లాండ్ టూర్ కల్లా అతడు ఫ్రెష్ గా బరిలోకి దిగాలని మేము కోరుకుంటున్నాం. అయితే అతడికి విశ్రాంతినిచ్చే అంశంపై సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారు..’ అని వెల్లడించాడు.
59
ఈ ఐపీఎల్ సీజన్ లో హిట్ మ్యాన్ 14 మ్యాచులాడి 19.14 సగటుతో 268 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ మొత్తమ్మీద ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా సీజన్ ను ముగించడం రోహిత్ కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
69
ఫామ్ లేమితో పాటు జట్టుగా కూడా విజయాలు లేక అలిసిపోయిన రోహిత్.. తాను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు. రాబోయే రోజుల్లో కీలక సిరీస్ లు, అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్-2022 కూడా ఉండటంతో దానికి సన్నద్ధమవడానికి రోహిత్ ఈ రెస్ట్ ను కోరుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
79
రోహిత్ తో పాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా లు కూడా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. సూర్యకు గాయమైన విషయం తెలిసిందే.
89
India vs West Indies, Yuzvendra Chahal, Rohit Sharma, INDvsWI 1st ODI
కాగా రోహిత్ అభ్యర్థనపై సెలెక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దక్షిణాఫ్రికా వాళ్ల బలమైన జట్టును భారత్ కు పంపిస్తున్నది. ఈ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్లు ఎవరూ లేకుండా ఆ జట్టును ఎదుర్కోవడమెలా..? అనేదానిపై కూడా సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. కనీసం మొదటి 3 మ్యాచుల వరకైనా పలువురు సీనియర్లు అందుబాటులో ఉండాలని తర్వాత నేరుగా ఇంగ్లాండ్ కు రావొచ్చునని కోరుతున్నారు.
99
ఇదిలాఉండగా నేడు (మే 22) న చేతన్ శర్మ ఆధ్వర్యంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వర్చువల్ గా సమావేశం కానున్నది. స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్ కు, ఐర్లాండ్ పర్యటనలకు గాను జట్టును ప్రకటించే అవకాశముంది.