క్రికెట్‌లో కొనసాగినంత కాలం సచిన్ టెండూల్కర్‌ని జట్టులో నుంచి తీసే సాహసం చేయలేకపోయారు ఏ కెప్టెన్ కూడా. ఆఖరికి రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలను పక్కనబెట్టిన ఎమ్మెస్ ధోనీ కూడా సచిన్ టెండూల్కర్‌కి జట్టులో చోటు ఇస్తూ వచ్చాడు. అయితే ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం రెండు సీజన్లుగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ 10 మ్యాచుల్లో ఓడి, ఆఖరి పొజిషన్‌తో సరిపెట్టుకుంది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఆఖరి పొజిషన్‌లో నిలవడం, 10 మ్యాచుల్లో ఓడడం కూడా ఇదే తొలిసారి...
29
ఎన్నడూ లేనట్టుగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ద్వారా తిలక్ వర్మ, హృతిక్ షోకీన్,
రమన్‌దీప్ సింగ్, కుమార్ కార్తీకేయ, డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి కొత్త కుర్రాళ్లకు ఐపీఎల్‌లో అవకాశం దొరికింది...
39
అయితే అనధికారికంగా నెట్ బౌలర్‌గా నాలుగైదు సీజన్లుగా, అధికారికంగా గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్‌తో ఉంటూ వస్తున్న అర్జున్ టెండూల్కర్‌కి మాత్రం ఈ సీజన్‌లో కూడా నిరాశే ఎదురైంది...
49
ఐపీఎల్ 2021 మినీ వేలంలో రూ.20 లక్షలకు, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.30 లక్షలకు అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే మనోడికి ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా దక్కలేదు...
59
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత కూడా అర్జున్ టెండూల్కర్‌కి ఒక్క అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కనీసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో అయినా అర్జున్ టెండూల్కర్‌కి అవకాశం దక్కుతుందని భావించారు అభిమానులు...
69
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు చేతులు కలుపుకునే సమయంలో అర్జున్ టెండూల్కర్ ఎమోషనల్ అవ్వడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. రిజర్వు బెంచ్‌లో కూర్చోవడానికే ఉన్నట్టున్నా అనే బాధ, దుఃఖం అర్జున్ ముఖంలో తెలిసింది..
79
దీంతో సచిన్ ఫ్యాన్స్, రోహిత్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.25 లక్షలకు అర్జున్ టెండూల్కర్ కొనుగోలు చేయడానికి కోట్ చేసింది. మళ్లీ ముంబై రూ.30 లక్షలకు అర్జున్‌ని కొనుగోలు చేసింది.
89
కనీసం టైటాన్స్‌కి వెళ్లి ఉన్నా అర్జున్ టెండూల్కర్ ఆటను చూసే అవకాశం దక్కి ఉండేదని అంటున్నారు సచిన్ టెండూల్కర్ అభిమానులు...
99
ఆఖరి ప్లేస్‌లో నిలిచిన సీజన్‌లోనే అర్జున్ టెండూల్కర్‌ని ఆడించడానికి రోహిత్ శర్మ ఆసక్తి చూపించకపోవడంతో, వచ్చే సీజన్లలో అతనికి అవకాశం దక్కుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్...