కప్ గెలవకపోయినా రికార్డులకేమీ తక్కువ లేదు... సీఎస్‌కే, ముంబై తర్వాతి ప్లేస్‌లో ఆర్‌సీబీ...

Published : May 22, 2022, 04:03 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ పర్ఫామెన్స్... ‘వారెవా!’ అనే రేంజ్‌లో అయితే సాగలేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 68 పరుగులకి, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగులకి ఆలౌట్ అయిన ఆర్‌సీబీ... అదృష్టం కలిసి రావడంతో ప్లేఆఫ్స్ ఆడబోతోంది...

PREV
18
కప్ గెలవకపోయినా రికార్డులకేమీ తక్కువ లేదు... సీఎస్‌కే, ముంబై తర్వాతి ప్లేస్‌లో ఆర్‌సీబీ...

నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది..

28
Image credit: PTI

లక్నోపై విజయం సాధిస్తే, రెండో క్వాలిఫైయర్‌కి అర్హత సాధించి... ఆ తర్వాత ఫైనల్‌లో గెలిస్తే మొట్టమొదటి ఐపీఎల్ కలను నెరవేర్చుకోగలుగుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

38

అయితే ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన జట్లు, టైటిల్ నెగ్గడం ఒకే ఒక్కసారి మాత్రమే జరిగింది. 2016 సీజన్‌లో లీగ్ స్టేజ్‌లో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, ఎలిమినేటర్‌లో కేకేఆర్‌ని, రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ లయన్స్‌ని ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి మొట్టమొదటి టైటిల్ నెగ్గగలిగింది...

48
Image credit: PTI

ఎస్‌ఆర్‌హెచ్ మిగిలిన మిగిలిన జట్లన్నీ రన్నరప్‌తో లేదా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. అదీకాక గత రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండు సీజన్లలోనూ ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది...
 

58

ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా అత్యధిక సార్లు ఫ్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మూడో జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌ చేరడం ఇది 8వ సారి...

68

నాలుగు సార్లు టైటిల్ గెలిచిన సీఎస్‌కే, 11 సార్లు ప్లేఆఫ్స్ ఆడి, ఐదు టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ 9 సార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచింది...

78

8 సార్లు ఫ్లేఆఫ్స్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కి దూసుకెళ్లింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ చేతుల్లో, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడిన ఆర్‌సీబీ, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది..

88

మరి ఈసారి హైదరాబాద్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ వంటి జట్లు ప్లేఆఫ్స్‌లో లేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టైటిల్ కలను నెరవేర్చుకుంటుందా? లేదా? చూడాలి..

Read more Photos on
click me!

Recommended Stories