రోహిత్ రిటైర్మెంట్ వెనుక ఒత్తిడా?
ఈ స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్లపై తాజాగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వచ్చిన నివేదిక ప్రకారం, రోహిత్ శర్మ సెలెక్షన్ విషయంలో భారత సెలక్టర్లు స్పష్టత లేకుండా ప్రవర్తించారని సమాచారం. వారు రోహిత్‌కు ఇంగ్లండ్ సిరీస్‌లో పూర్తిగా ఆడే అవకాశం లేదనీ, కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడవచ్చని తెలిపారు. దీనివల్ల రోహిత్ నిరుత్సాహంతో రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఒక బోర్డు సభ్యుడు వెల్లడించిన ప్రకారం.. "సెలక్టర్లు రోహిత్ స్థానంపై స్పష్టత చూపలేదు. దీంతో ఆయన ఒత్తిడిలో ఉన్నారు. ఆయన్ను రెండు టెస్టులకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది" అని చెప్పారు.