‘నేను అలాంటి వాడిని కాదు...’ విరాట్ కోహ్లీని ట్రోల్ చేసిన రోహిత్ శర్మ...

First Published Nov 14, 2020, 10:29 AM IST

IPL 2020 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుగులేని ఆధిక్యం కనబరుస్తున్న ముంబై... ఏకంగా ఐదుసార్లు టైటిల్స్ సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అయితే ఈ విజయం అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

2020 సీజన్‌లో కేవలం 15 మంది ప్లేయర్లతోనే ఆడి, టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్... క్రిస్ లీన్, మెక్‌లగాన్ వంటి విదేశీ ప్లేయర్లకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...
undefined
జట్టులో చోటు దక్కని, అండర్ 19 ప్లేయర్‌కి ట్రోఫీని లిఫ్ట్ చేసే అవకాశం ఇచ్చి, అందరి మనసులు దోచుకున్నాడు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ...
undefined
ఫైనల్ మ్యాచ్ విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ... ‘ఎవరైనా ప్లేయర్ సరిగా ఆడకపోతే... నెక్ట్స్ మ్యాచ్‌లో ఆడకపోతే నీకు జట్టులో చోటు ఉండదు... అని బెదిరించే కెప్టెన్‌ను నేను కాదు... నాకు నా ప్లేయర్స్‌పైన పూర్తి నమ్మకం ఉంది. నేను కూడా గత రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాను... అందుకే ప్రతీ ప్లేయర్‌ని గౌరవిస్తాను’ అంటూ వ్యాఖ్యానించాడు.
undefined
రోహిత్ శర్మ తన గురించి మాత్రమే చెప్పినా విరాట్ ఫ్యాన్స్ మాత్రం, కోహ్లీని ఉద్దేశించే రోహిత్ ఈ రకంగా కామెంట్స్ చేశాడని అంటున్నారు...
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహారించిన విరాట్ కోహ్లీ... జట్టులో చాలా మార్పులు చేశాడు. ఈ సీజన్‌లో దాదాపు 20 మంది దాకా ఆర్‌సీబీ తరుపున ఆడారు..
undefined
ఇప్పుడు పంజాబ్, ఢిల్లీ, చెన్నై జట్లలో రాణిస్తున్న కెఎల్ రాహుల్, క్రిస్‌గేల్, స్టోయినిస్, హెట్మయర్, షేన్ వాట్సన్ వంటివాళ్లంతా ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్‌కి ఆడిన వాళ్లే...
undefined
ఒక్క క్రిస్‌గేల్ మినహాయిస్తే మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ ఆర్‌సీబీ తరుపున పెద్దగా రాణించలేకపోయారు. ఈ విషయంపై కెఎల్ రాహుల్ గత సీజన్‌లో కోహ్లీ కెప్టెన్సీ కామెంట్ కూడా చేశాడు...
undefined
‘రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఉంటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది... స్టార్ల మధ్య ఉండడం వల్ల ఆడడానికి వీలు కాదు. ఆడకపోతే ఒత్తిడి పెరిగిపోతుంది... ఇక్కడ ఫ్రీగా ఆడుతున్నా’ అంటూ ఆర్‌సీబీ గురించి వ్యాఖ్యానించాడు ప్రస్తుత కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కెఎల్ రాహుల్...
undefined
దీంతో విరాట్ కోహ్లీ గురించి పరోక్షంగా ఉద్దేశిస్తూ రోహిత్ శర్మ ‘నేను అలాంటి వాడిని కాదు...’ అనే కామెంట్ చేశాడని అంటున్నారు క్రికెట్ అభిమానులు...
undefined
అయితే ఈ విషయంపై రోహిత్ ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రోహిత్ అలా అన్నాడు, ఇలా అన్నాడు అని ఏడిచే బదులు, విరాట్ కోహ్లీని ఒక్క టైటిల్ గెలిచి చూపించమని చెప్పండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
undefined
ముంబై ఇండియన్స్ విజయం తర్వాత టీ20 కెప్టెన్సీ రోహిత్ శర్మకు అప్పగించాలని డిమాండ్ భారీగా వినిపిస్తోంది. ఆసీస్‌ టూర్‌లో కోహ్లీ ఫెయిల్ అయితే, ఈ విమర్శలు మరింత పెరగవచ్చు.
undefined
click me!