ధోనీ ఫ్యాన్స్‌కి షాక్... వచ్చే సీజన్‌లో చెన్నై కెప్టెన్‌గా అతను... రైనా కూడా కాదు!

Published : Nov 13, 2020, 07:06 PM IST

IPL 2020 సీజన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 10 సీజన్లలో ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్... మొట్టమొదటిసారి ఐపీఎల్ కెరీర్‌లో ప్లేఆఫ్ చేరకపోగా చెత్త ప్రదర్శనతో ఏడో స్థానానికి పరిమితమైంది. ధోనీ వచ్చే సీజన్‌లో చెన్నైకి ఆడతానని చెప్పడం మాహీ ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చే అంశం. అయితే వచ్చే సీజన్‌లో ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్.

PREV
110
ధోనీ ఫ్యాన్స్‌కి షాక్... వచ్చే సీజన్‌లో చెన్నై కెప్టెన్‌గా అతను... రైనా కూడా కాదు!

2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పటి నుంచి 2020 దాకా 13 సీజన్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఏకైక సారథి మహేంద్ర సింగ్ ధోనీ...

210

10 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ప్లేఆఫ్‌కి చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ... 8 సార్లు ఫైనల్‌ చేర్చి, మూడు టైటిల్స్ అందించాడు...

310

ధోనీ కెప్టెన్ కావడం వల్లే ఐపీఎల్‌లో అత్యధిక ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న జట్లలో ఒకటిగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్...

410

ధోనీ మీద ఉన్న ప్రేమతో తమిళులు, అతన్ని ‘తలైవా’ అని పిలుస్తారు... అయితే ఈ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.

510

దీంతో ఇన్ని సీజన్లలో ధోనీని పొడుగుతూ ‘విజిల్ పోడు’ అంటూ సపోర్ట్ చేసిన అభిమానులే, మాహీని తిడుతూ విమర్శిస్తూ ట్రోల్స్ చేశారు...

610

మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు రావడం కొత్తేమీ కాదు, ఇంతకుముందు చాలాసార్లు ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు మాహీ...

710

అయితే ఈసారి ధోనీ నాలుగేళ్ల కూతురు జీవాపై కూడా అత్యాచార బెదిరింపులు వచ్చాయి... దీంతో సీఎస్‌కే ప్లేఆఫ్‌ను తప్పుకున్న తర్వాత మహీ భార్య సాక్షి సింగ్ ‘ఆటను ఆటగా మాత్రమే చూడాలి’ అంటూ పోస్టు చేసింది.

810

వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడతానని చెప్పినా, సారథ్యం మోసే బాధ్యత మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ తీసుకోకపోవచ్చని అభిప్రాయపడ్డాడు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.

910

‘2011 వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ధోనీ అనుకున్నాడు. కానీ జట్టును నడిపించే కెప్టెన్ కనిపించకపోవడంతో 2015 దాకా ఆగాడు. కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత కూడా జట్టులో కొనసాగాడు ధోనీ.

1010

ఇదే విధంగా వచ్చే సీజన్‌లో డుప్లిసిస్‌కి కెప్టెన్సీ అప్పగించి, మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాడిగా కొనసాగుతాడని అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు బంగర్...

click me!

Recommended Stories