బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 48 పరుగుల వద్ద అవుట్ కాగా శుబ్‌మన్ గిల్ 53 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..
Virat Kohli
‘శ్రేయాస్ అయ్యర్ ఆరంభంలో ఎంతో ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించేవాడు. అనవసర షాట్లు ఆడేవాడు కాదు. అయితే ఇప్పుడు అతనికి సహనం తగ్గినట్టు కనిపిస్తోంది. 19 పరుగులు చేసి అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు..
శుబ్‌మన్ గిల్ కూడా అంతే. ఆలెడ్రీ ఓ సిక్సర్ కొట్టిన తర్వాత మళ్లీ అదే రకమైన షాట్, అదే పొజిషన్‌లో ఆడడం అవసరమా? విరాట్ కోహ్లీ ఎప్పుడూనా ఇలా వికెట్ పారేసుకోవడం చూశారా?
Virat Kohli
విరాట్ కోహ్లీ ఎప్పుడూ కూడా వికెట్‌ని ఇవ్వడు? అతని వికెట్ తీయాలంటే బౌలర్ కష్టపడేలా చేస్తాడు? శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ విరాట్ కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి..
Shubman Gill
విరాట్ కోహ్లీ 70-80 పరుగుల వద్ద ఉన్నప్పుడు, సెంచరీ చేయాలని అనుకుని ఉంటాడు? నిజానికి అక్కడ స్పేస్ లేదు. అంత తక్కువ లక్ష్యం ఉన్నప్పుడు సెంచరీ వస్తుందని ఎవ్వరూ అనుకోరు. కానీ విరాట్ క్రియేట్ చేసుకున్నాడు..
Shreyas Iyer
ప్రతీ రోజూ సెంచరీ కొట్టడం అయ్యేపని కాదు. అయితే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదలకుండా పట్టుకోవడం కూడా తెలుసుకోవాలి. శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వచ్చాడు. అతనికి సెంచరీ చేసే అవకాశం ఉంది..
Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేయలేకపోతున్నాడు. అతని వికెట్ చాలా తేలిగ్గా దక్కుతోంది. నెం.1 బ్యాటర్‌కి పిచ్ గురించి అవగాహన ఉండాలి. అంతేకానీ గుడ్డిగా అటాక్ చేయాలని వచ్చి, వికెట్ పారేసుకోకూడదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...