IPL 2024: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ.. రాజస్థాన్ రాయల్స్‌కి షాక్...

First Published | Oct 20, 2023, 8:04 PM IST

ఐపీఎల్ 2024 సీజన్ సందడి మొదలైపోయింది. వచ్చే సీజన్‌లో లసిత్ మలింగను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్టుగా ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. ఆరు నెలల క్రితం వచ్చిన వార్తలను నిజం చేస్తూ ముంబై టీమ్‌లో తిరిగి చేరాడు మలింగ..
 

కొంతకాలంగా న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్, ముంబై ఇండియన్స్‌కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అతని స్థానంలో లసిత్ మలింగను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్..

Malinga

ఇప్పటికే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఎంఐ న్యూయార్క్, సౌతాఫ్రికా20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ టీమ్స్‌కి బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు లసిత్ మలింగ. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి కూడా అదే బాధ్యతలు నిర్వహించబోతున్నాడు..


2008 నుంచి 11 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కి ప్లేయర్‌గా ఆడాడు లసిత్ మలింగ. 2018 ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ మెంటర్‌గా వ్యవహరించిన మలింగ, నాలుగు ఐపీఎల్ టైటిల్స్, రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు..

బౌలర్‌గా 170 ఐపీఎల్ వికెట్లు తీసిన లసిత్ మలింగ, 2022-23 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగర్కర, తన టీమ్ మేట్‌ లసిత్ మలింగను రాయల్స్‌కి బౌలింగ్ కోచ్‌గా తేవడంలో కీ రోల్ పోషించాడు..

గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2022లో జస్ప్రిత్ బుమ్రా తప్ప మరో ఫాస్ట్ బౌలర్ లేక, వరుస పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్..

2023 సీజన్‌లో బుమ్రా గాయపడడం, భారీ అంచనాలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ కూడా సరిగ్గా ఆడకపోవడం టీమ్‌పై ఎఫెక్ట్ చూపించింది. కుమార కార్తికేయ, ఆకాశ్ మద్వాల్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్ వంటి కుర్రాళ్లతోనే ప్లేఆఫ్స్ దాకా వెళ్లినా, ఫైనల్ చేరలేకపోయింది..

Latest Videos

click me!