రోహిత్ శర్మ గొప్ప బ్యాటరే కానీ ఆ పొట్టేంటి... టీమిండియా కెప్టెన్ ఫిట్‌నెస్‌పై కపిల్ దేవ్ ఫైర్...

Published : Feb 23, 2023, 03:52 PM IST

1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ కంటే కుర్రాళ్లకు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్, ఇప్పుడు రోహిత్ శర్మను టార్గెట్ చేశాడు...

PREV
15
రోహిత్ శర్మ గొప్ప బ్యాటరే కానీ ఆ పొట్టేంటి... టీమిండియా కెప్టెన్ ఫిట్‌నెస్‌పై కపిల్ దేవ్ ఫైర్...

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్ బ్యాటింగ్‌లో ఫెయిలైన ప్రతీసారీ ‘వడాపావ్’ పేరుతో సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా రోహిత్ ఫిట్‌నెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు..

25
Rohit Sharma

‘క్రికెటర్ అనే ప్రతీ ఒక్కరికీ ఫిట్‌గా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా కెప్టెన్‌ చాలా ఫిట్‌గా ఉండాలి. అప్పుడే మిగిలిన వాళ్లు ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకుంటారు. కెప్టెన్ ఫిట్‌గా లేకపోతే అది సిగ్గు చేటు...

35
Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ ఈ విషయంలో చాలా కష్టపడాలి. అతను చాలా గొప్ప బ్యాట్స్‌మెన్. అయితే అతని ఫిట్‌నెస్ గురించి మాట్లాడితే... తను ఓవర్‌ వెయిట్ ఉన్నట్టు క్లియర్‌గా కనిపిస్తోంది. కనీసం టీవీల్లో అయినా ఫిట్‌గా కనిపించాలి కదా..

45
Image credit: PTI

టీవీల్లో చూసేదానికి, బయట చూసేదానికి చాలా తేడా ఉంటుంది. అయితే రోహిత్‌ని ఆ పొట్టతో టీవీల్లో అస్సలు చూడలేకపోతున్నాం. అతను గొప్ప ప్లేయర్, గొప్ప కెప్టెన్.. అయినా కూడా ఫిట్‌‌నెస్ సాధించి తీరాల్సిందే...
 

55
Image credit: PTI

విరాట్ కోహ్లీనే చూడండి. అతన్ని చూసిన ప్రతీసారీ ఫిట్‌గా హెల్తీగా కనిపిస్తాడు. క్రికెటర్లు అలా ఉండాలి... అలా ఉంటేనే వికెట్ల మధ్య చిరుతల్లా పరుగెత్తగలరు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్..

Read more Photos on
click me!

Recommended Stories