వరల్డ్ క్రికెట్‌లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ షోయబ్ అక్తర్. ఫాస్ట్ బౌలర్ల యుగంలోనూ షోయబ్ అక్తర్ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయతే 1997లో అంతర్జాతయ ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, ఎప్పుడూ పాకిస్తాన్ టీమ్‌కి కెప్టెన్సీ చేయలేదు...
పాకిస్తాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.3 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు...
26
అంతర్జాతీయ క్రికెట్‌లో 450 వికెట్లు పడగొట్టిన షోయబ్ అక్తర్, ఎందుకని పాకిస్తాన్ టీమ్‌కి ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేకపోయాడు. ఈ విషయంపై తాజాగా మనసులో మాట బయటపెట్టాడు షోయబ్ అక్తర్..
36
‘నిజం చెప్పాలంటే పాక్ టీమ్‌లోకి వెళ్లిన ఐదేళ్లకు 2002లో నాకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చింది. అయితే నేను ఎప్పుడూ ఫిట్‌గా లేదు. సిరీస్‌లో ఐదు మ్యాచులు ఉంటే అందులో మూడు మ్యాచులు మాత్రమే ఆడేవాడిని. మిగిలిని రెండు మ్యాచులు ఫిట్‌నెస్ సమస్యలతో కూర్చునేవాడిని..
46
అందుకే 2002లో నాకు కరెక్టు ఆడి మరో ఏడాదిన్నర, లేదా రెండేళ్లు మాత్రమే క్రికెట్ ఆడగలనని అనిపించింది. అందుకే ఈ సమయంలో కెప్టెన్సీ తీసుకోవడం కరెక్ట్ కాదని వదిలేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్..
56
Shoaib Akhtar
అయితే షోయబ్ అక్తర్ 2011 వన్డే వరల్డ్ కప్ వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపికైన షోయబ్ అక్తర్, గ్రూప్ మ్యాచుల తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచుల్లో అక్తర్‌కి చోటు దక్కలేదు...
66
కీలక మ్యాచుల్లో టీమ్‌లో చోటు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ షోయబ్ అక్తర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత యూట్యూబ్ వీడియోలతో తెగ బిజీగా గడిపేస్తున్నాడు అక్తర్..