అందుకే ఆ షాట్ ఆడాను... అవుట్ అయినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదు... రోహిత్ శర్మ వివరణ...

First Published Jan 17, 2021, 6:00 AM IST

గబ్బా టెస్టులో చూడచక్కని షాట్లతో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మెచ్చుకుంటున్న సమయంలోనే ఓ చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్ బాధ్యత లేకుండా ఇలాంటి షాట్ ఆడడం క్షమించరాని నేరమంటూ ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
undefined
విరాట్ కోహ్లీ లేని సమయంలో, ప్రత్యర్థి మంచి స్కోరు చేసినప్పుడు... అదీ టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి షాట్లు ఆడాల్సిన అవసరం ఏముందని తీవ్రస్థాయిలో రోహిత్‌పై మండిపడ్డాడు సునీల్ గవాస్కర్.
undefined
ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మ, ఏ మాత్రం అనుభవం లేని యంగ్ ప్లేయర్‌గా కీలక సమయంలో చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడంటూ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేశాడు.
undefined
రెండో రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం వీడియో ద్వారా ఈ విమర్శలకు సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ...
undefined
‘నిజానికి నేను ఈ రోజు అనుకున్నట్టుగానే బ్యాటింగ్ చేశాను. అవుట్ అయిన షాట్ ఆడినందుకు కూడా నేనేం ఫీల్ కావడం లేదు...
undefined
బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి ఇలాంటి షాట్‌లు ఆడడం నాకు అలవాడు. నాథన్ లియాన్ చాలా తెలివైన బౌలర్...
undefined
అతని బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. అందుకే షాట్లు ఆడితే, లియాన్ ఒత్తిడికి గురవుతాడు...
undefined
ఇదే టెక్నిక్‌ను ఇంతకుముందు చాలాసార్లు ఉపయోగించాను. సక్సెస్ అయ్యాను కూడా. ఇలాంటి షాట్స్ ఆడినప్పుడు కొన్నిసార్లు ఫలితం వేరేగా ఉంటుంది. అదే ఈరోజు జరిగింది.
undefined
ఈ సారి అవుట్ అయినంత మాత్రం ఇలాంటి షాట్స్ ఆడడం మానను. దాన్ని ఇలాగే కొనసాగిస్తాను. నాపై జట్టు నమ్మకం చాలా నమ్మకం ఉంచింది.
undefined
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. విమర్శలను పట్టించుకోను...’ అంటూ వివరణ ఇచ్చాడు రోహిత్ శర్మ.
undefined
74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ కావడంతో 60 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 7 పరుగులకే అవుటయ్యాడు.
undefined
click me!