వరల్డ్ కప్ గెలిచే టీమ్‌, రోహిత్ శర్మ దగ్గర లేదు! అతనికి కెప్టెన్సీ కూడా సూట్ కాదు... షోయబ్ అక్తర్ కామెంట్స్..

First Published Aug 18, 2023, 6:25 PM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు రోహిత్ శర్మ. ఆ ట్రాక్ రికార్డు కారణంగానే విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలు రోహిత్‌కి అప్పగించింది బీసీసీఐ. అయితే టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటిదాకా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు..
 

Virat Kohli and Rohit Sharma

12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతోంది భారత జట్టు. 2011 వన్డే వరల్డ్ కప్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ, ఈసారి కెప్టెన్‌గా 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాని నడిపించబోతున్నాడు..

‘రోహిత్ శర్మను చూసినప్పుడల్లా నాకు ఒకే అనుమానం కలుగుతూ ఉంటుంది. నిజంగా రోహిత్ శర్మ ఇష్టపూర్వకంగానే టీమిండియా కెప్టెన్సీని తీసుకున్నాడా? అని.. రోహిత్ శర్మ చాలా సందర్భాల్లో టెన్షన్ పడడం, ఒత్తిడికి లోనుకావడం చూశాను..

కెప్టెన్సీ ప్రెషర్, రోహిత్ టాలెంట్‌ని తినేస్తోంది. విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు. అందుకే కెప్టెన్‌గా ఐసీసీ టోర్నమెంట్స్ గెలవలేకపోయాడు. ఓ బ్యాటర్‌గా రోహిత్ శర్మ దగ్గర విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ షాట్స్ ఉన్నాయి..

టెక్నికల్‌గా అతను టాప్ క్లాస్ బ్యాటర్. క్లాసిక్ షాట్స్‌తో చూసే ప్రేక్షకులను ఇట్టే మెస్మరైజ్ చేసేస్తాడు. అయితే కెప్టెన్సీ విషయానికి వస్తే, అతనిలో నాకు అంత ఫైర్ కనిపించడం లేదు. అదీకాకుండా కెప్టెన్సీ కారణంగా అతను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు..

అదీకాకుండా వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన టీమ్, రోహిత్ శర్మ దగ్గర లేదు. కెఎల్ రాహుల్ గాయపడ్డాడు, శ్రేయాస్ అయ్యర్ కూడా అందుబాటులో లేడు. వన్డేల్లో బాగా ఆడిన ప్లేయర్లు, చాలా కాలంగా టీమ్‌కి దూరంగా ఉంటున్నారు.

ఒకవేళ రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ గెలిచి నా అభిప్రాయం తప్పని నిరూపిస్తే మంచిదే. అయితే అతను ఆ పని చేయగలడా? అనేది నాకు అనుమానమే. 130 కోట్ల మంది భారతీయుల కలలను మోయడం, రోహిత్‌కి అదనపు ప్రెషర్.. ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. 

click me!