శ్రేయాస్ అయ్యర్ కోలుకోకపోతే సూర్యకే ఓటు! తిలక్ వర్మ, సంజూకి నో ఛాన్స్.. ఆసియా కప్ టీమ్ సెలక్షన్‌లో..

Published : Aug 18, 2023, 05:31 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ఇంకా పట్టుకుని 15 రోజుల సమయం కూడా లేదు. అయితే ఇప్పటిదాకా జట్టును ప్రకటించలేదు బీసీసీఐ. కారణం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడమే..  

PREV
19
శ్రేయాస్ అయ్యర్ కోలుకోకపోతే సూర్యకే ఓటు! తిలక్ వర్మ, సంజూకి నో ఛాన్స్.. ఆసియా కప్ టీమ్ సెలక్షన్‌లో..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రిపరేషన్స్‌గా ఆసియా కప్ 2023 టోర్నీకి వన్డే ఫార్మాట్‌లో నిర్వహించబోతున్నారు. టీమిండియా కీ ప్లేయర్లు జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ చాలా రోజులుగా గాయాలతో బాధపడుతున్నారు..
 

29

జస్ప్రిత్ బుమ్రా, ఐర్లాండ్ టూర్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 14 నెలల తర్వాత బుమ్రా బౌలింగ్‌ చూడబోతున్నారు ఫ్యాన్స్. ఐర్లాండ్ టూర్‌లో మొదటి రెండు మ్యాచులు ముగిసిన తర్వాత ఆసియా కప్ 2023 జట్టు ఎంపిక విషయంలో ఓ క్లారిటీకి రావాలని నిర్ణయం తీసుకున్నారట సెలక్టర్లు..

39

జస్ప్రిత్ బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వెస్టిండీస్ టూర్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడబోతున్నారు. వీరి పర్ఫామెన్స్ కూడా ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు లైన్ క్లియర్ చేయనుంది...
 

49

కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినా, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడడం లేదు. అయితే అతనికి ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కడం ఖాయం. ఇంతకుముందు 2022 ఆసియా కప్ టోర్నీకి ముందు కెఎల్ రాహుల్ గాయపడడం, నేరుగా మెగా టోర్నీలో రీఎంట్రీ ఇవ్వడం, అందులో అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరిగిపోయాయి. ఈసారి వన్డే ఫార్మాట్‌ కావడంలో అలా జరగదని ఆశిస్తున్నారు అతని ఫ్యాన్స్..

59

శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వెన్ను గాయంతో మ్యాచ్‌కి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్...  అయితే ఓ బ్యాటర్‌‌ని వెన్ను సమస్య ఇంతలా బాధించడం ఏంటో డాక్టర్లకు కూడా అంతుపట్టడం లేదట..

69

శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకోకపోతే అతని ప్లేస్‌లో మొదటి ఛాయిస్‌గా సూర్యకుమార్ యాదవ్‌వైపు చూస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. వన్డే ఫార్మాట్‌లో సూర్య అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అయితే రోహిత్ శర్మకు సూర్యపైన ఉన్న నమ్మకంతో అతన్ని ఎలాగైనా వన్డేల్లో ఇరికించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది మేనేజ్‌మెంట్..

79

తిలక్ వర్మ, వెస్టిండీస్ టూర్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఆకట్టుకున్నాడు. అయితే ఐర్లాండ్ టూర్‌లోనూ తిలక్ వర్మ బ్యాటు నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ వస్తే అతనికి స్టాండ్ బై ప్లేయర్‌గా ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కవచ్చని తెలుస్తోంది..

89
KL Rahul

కెఎల్ రాహుల్ కోలుకోవడంతో సంజూ శాంసన్‌‌కి ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు పోయినట్టేనని సమాచారం. కెఎల్ రాహుల్‌‌తో పాటు ఇషాన్ కిషన్‌ని వికెట్ కీపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది...

99
Sanju Samson

వన్డేల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్న సంజూని తప్పించడానికే అతన్ని టీ20ల్లో ఆడించారని, టాపార్డర్, మిడిల్ ఆర్డర్‌లో కాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి పంపి.. అతను ఫెయిల్ అయ్యేలా ప్రెషర్ పెంచారని కామెంట్లు చేస్తున్నారు అతని అభిమానులు..

click me!

Recommended Stories