లక్నో సూపర్ జెయింట్స్‌‌కి గంభీర్ గుడ్‌బై! తిరిగి కోల్‌కత్తాలోకి... గౌతీ కోసం షారుక్ టీమ్ ఫ్యాన్సీ ప్రైజ్...

Published : Aug 18, 2023, 06:05 PM IST

ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి టీమ్స్ కోచింగ్ స్టాఫ్‌ని మార్చేశారు. ఈ మూడు టీమ్స్ హెడ్ కోచ్‌లు మారిపోయారు.  లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా టీమ్ మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి..  

PREV
16
లక్నో సూపర్ జెయింట్స్‌‌కి గంభీర్ గుడ్‌బై! తిరిగి కోల్‌కత్తాలోకి... గౌతీ కోసం షారుక్ టీమ్ ఫ్యాన్సీ ప్రైజ్...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంగ్రేటం చేసిన లక్నో సూపర్ జెయింట్స్, రూ.17 కోట్లు పెట్టి కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా తీసుకుంది. ఈ దెబ్బకు ఐపీఎల్ కెప్టెన్‌గా అత్యధిక మొత్తం అందుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు కెఎల్ రాహుల్..

26

రూ.7090 కోట్ల బిడ్‌తో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన టీమ్‌గా మారిన లక్నో సూపర్ జెయింట్స్‌కి గత రెండు సీజన్లలో ఆండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరించాడు.  ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ని కోచ్‌గా నియమించుకుంది ఎల్‌ఎస్‌జీ..

36

కోచ్ ఆండీ ఫ్లవర్ అయినా డగౌట్‌లో సందడి అంతా మెంటర్ గౌతమ్ గంభీర్‌దే. మ్యాచ్ గెలిచినప్పుడు అరుస్తూ ఆవేశంతో చెలరేగిపోయే గంభీర్, మ్యాచ్ ఓడిపోతే కెఎల్ రాహుల్ అండ్ కో వైపు గుర్రున చూసేవాడు. మెంటర్ గంభీర్‌కి సీజన్‌కి రూ.10 కోట్ల వరకూ చెల్లిస్తూ వచ్చింది లక్నో సూపర్ జెయింట్స్..
 
46

అయితే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్, గౌతమ్ గంభీర్‌ని తిరిగి టీమ్‌లోకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2012 సీజన్‌లో కేకేఆర్‌ని టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన గౌతమ్ గంభీర్, ఆ తర్వాత 2014లో రెండోసారి కోల్‌కత్తాకి టైటిల్ అందించాడు..

56

గౌతమ్ గంభీర్ టీమ్ నుంచి వెళ్లిపోయిన మళ్లీ టైటిల్ గెలవలేకపోయిన షారుక్ ఖాన్ టీమ్, 2021 సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరినా... టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో గంభీర్‌ని తిరిగి టీమ్‌లోకి తెచ్చేందుకు పావులు కదుపుతోందట కేకేఆర్..

66
Gautam Gambhir

click me!

Recommended Stories