రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడా... ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్...

Published : Aug 26, 2022, 04:20 PM IST

గత కొన్నాళ్లుగా టీమిండియాని వెంటాడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది గాయాలే. 2022 ఆరంభం నుంచి ఇప్పటిదాకా భారత జట్టు 8 మంది కెప్టెన్లను మార్చాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆటగాళ్లు గాయపడడమే. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి దూరంగా ఉన్నాడు...

PREV
17
రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడా... ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్...
Rohit Sharma

వర్క్ లోడ్ తగ్గించే ఉద్దేశంతో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వరుస బ్రేక్‌లు ఇస్తూ వస్తోంది బీసీసీఐ. ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌లకు సీనియర్లు కూడా తప్పక అందుబాటులో ఉండాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి కూడా...

27
Rohit Sharma Asia Cup

తాజాగా ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఉంది.  పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్స్‌లో చురుగ్గా పాల్గొన్నాడు....

37
Rohit Sharma

అయితే ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత రోహిత్ శర్మ ఓ కిక్ స్కూటర్‌పై మైదానమంతా చక్కర్లు కొట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ. దీంతో అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ‘భాయ్... ఏదైతే అదైంది... దాన్ని పక్కనబెట్టు, కీలక టోర్నీ ముందు నువ్వు గాయపడితే కష్టమైపోద్ది...’ అంటూ పోస్టులు చేశారు ఎక్కువ మంది...

47
rohit sharma

ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ మీడియాతో ముచ్ఛటించాల్సి ఉంటుంది. అయితే రోహిత్, మీడియా సమావేశానికి రావడానికి ఇష్టపడలేదు...రోహిత్ శర్మ స్థానంలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, మీడియా సమావేశానికి రాబోతున్నాడు. 

57

రోహిత్ రాకుండా కెఎల్ రాహుల్ వస్తున్నాడనే వార్త బయటికి రావడంతో ‘హిట్ మ్యాన్’కి మళ్లీ గాయమైందా? అనే అనుమానాలు రేగుతున్నాయి. మనోడి ఫిట్‌నెస్ లెవెల్స్ అంతంత మాత్రమే. కీ టోర్నీలకు గాయపడడం కూడా రోహిత్‌కి బాగా అలవాటు.. 

67
Image credit: Getty

అసలే ముట్టుకుంటే కందిపోయేంత సుకుమారుడైన రోహిత్ శర్మ మరోసారి గాయపడితే, ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అందుకే రోహిత్ శర్మ కనీసం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసే వరకైనా ఫిట్‌గా ఉండి టీమ్‌కి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు...

77

విరాట్ కోహ్లీ గైర్హజరీలో ఆసియా కప్ 2018 టోర్నీలో టీమిండియా నడిపించిన రోహిత్ శర్మ, టైటిల్ విజేతగా నిలబెట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్, వరుస విజయాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా దూసుకుపోతున్నాడు... 

Read more Photos on
click me!

Recommended Stories