షాహీన్‌ లేకపోతేనేం, టీమిండియాని ఓడించడానికి వీళ్లు చాలు... పాక్ హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్...

First Published Aug 26, 2022, 2:24 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు షాహీన్ షా ఆఫ్రిదీ గాయపడడంతో పాక్ క్రికెట్‌ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా టాపార్డర్‌ని ముప్పుతిప్పలు పెట్టిన షాహీన్ ఆఫ్రిదీ లేకపోయినా భారత్‌పై తమదే విజయం అంటున్నాడు పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్... 

Mohammad Hasnain

షాహీన్ షా ఆఫ్రిదీ గాయపడడంతో అతని స్థానంలో 8 నెలల క్రితం బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేని కారణంగా బ్యాన్ పడిన మహ్మద్ హస్నైన్‌కి ఆసియా కప్ 2022 టోర్నీలో అవకాశం కల్పించింది పాక్ క్రికెట్ బోర్డు... 

‘మేం ఎన్నో రోజుల నుంచే కఠినమైన ఛాలెంజ్‌లకు సిద్ధపడేలా పాక్ జట్టును సిద్ధం చేస్తున్నాం. జట్టుకి అవసరాలకు తగ్గట్టుగా వికెట్లు తీయగల బౌలర్లు చాలా మంది ఉన్నారు. బాబర్ ఆజమ్‌తో పాటు నాకు, టీమ్ మొత్తానికి మా బౌలింగ్ యూనిట్‌పై పూర్తి నమ్మకం ఉంది...

Muhammad Hasnain

షాహీన్ ఆఫ్రిదీ ఉండి ఉంటే, మా బౌలింగ్ యూనిట్ అత్యంత పటిష్టంగా ఉండేది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అతను లేకపోయినా టీమిండియాని వణికించగల బౌలర్లు మా టీమ్‌లో ఉన్నారు... నసీం సా, మహ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్‌లను ఎదుర్కోవడం అంత ఈజీయేం కాదు...
 

Mohammad Hasnain

ఈ ముగ్గురు ఏ కండీషన్లలో అయినా బౌలింగ్ వేసి వికెట్లు తీయగలరు. షాహీన్ లేకపోయినా భారత బ్యాటర్లకు పాక్ జట్టును ఎదుర్కోవడం పెద్ద ఛాలెంజ్‌గానే ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్...

Hasan Ali vs Virat Kohli

షాహీన్ ఆఫ్రిదీ గాయం కారణంగా ఆసియా కప్ 2022 నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ హసన్ ఆలీకి అవకాశం దక్కుతుందని భావించారంతా. అయితే అతన్ని పట్టించుకోని పీసీబీ, యంగ్ బౌలర్ మహ్మద్ హస్నైన్‌కి పిలుపునిచ్చింది..

మరోవైపు భారత జట్టు కూడా ప్రధాన బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీలో బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ గాయపడి టోర్నీకి దూరం కావడంతో ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యంగ్ ఫాస్ట్ బౌలర్లతో ఆసియా కప్‌ ఆడబోతోంది టీమిండియా.. 

click me!