Kwena Maphaka: 19 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. ఎవరీ చిచ్చరపిడుగు !

Published : Aug 11, 2025, 03:58 PM IST

Kwena Maphaka: ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మొదటి టీ20లో 19 ఏళ్ల పేసర్ క్వెనా మఫాకా అద్భుత‌మైన బౌలింగ్ లో అద‌ర‌గొట్టాడు. ఫాస్ట్ బౌలర్‌గా చిన్న వ‌య‌స్సులోనే ప్రపంచ రికార్డు సాధించాడు.

PREV
15
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో టిమ్ డేవిడ్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును 178 పరుగుల ఫైట్ చేసే స్థాయికి తీసుకెళ్లాడు.

DID YOU KNOW ?
దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ షాన్ పోలాక్
దక్షిణాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ షాన్ పోలాక్. ఆయన 1995-2008 మధ్య 414 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 823 వికెట్లు తీశారు.
25
క్వెనా మఫాకా అద్భుమైన బౌలింగ్

సౌతాఫ్రికా యంగ్ పేసర్ క్వెనా మఫాకా తన అద్భుత‌మైన బౌలింగ్‌తో మ్యాచ్‌లో ప్రకంపనలు రేపాడు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో స్టార్ ప్లేయ‌ర్ల‌ను సైతం చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 20 పరుగులకే 4 వికెట్లు తీశాడు. 5 ఎకానమీ రేట్‌తో అతను అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కానీ సౌతాఫ్రికా 161 పరుగులకే ఆగిపోవడంతో అతని రికార్డు బౌలింగ్ ప్రదర్శన జట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది.

35
19 ఏళ్లకే క్వెనా మ‌ఫాకా ప్రపంచ రికార్డు

క్వెనా మఫాకా 19 ఏళ్లు 124 రోజుల వయసులో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడైన ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ కేటగిరీలో అతను సౌతాఫ్రికా తరఫున కూడా అత్యంత పిన్న వయస్కుడు కావ‌డం విశేషం.

ప్రపంచంలో 5వ పిన్న వయస్కుడు క్వెనా మ‌ఫాకా

క్వెనా మఫాకా ప్రదర్శనతో అతను ప్రపంచంలో 4 వికెట్లు తీసిన 5వ పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో 17 ఏళ్లు 162 రోజుల వయసులో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, షదాబ్ ఖాన్ ఉన్నారు.

45
4 వికెట్లు తీసిన పిన్న వయస్కుల జాబితా

1. నూర్ అహ్మద్ - 17 ఏళ్లు 162 రోజులు

2. ముజీబ్ ఉర్ రహ్మాన్ - 18 ఏళ్లు 171 రోజులు

3. రషీద్ ఖాన్ - 18 ఏళ్లు 171 రోజులు

4. షదాబ్ ఖాన్ - 18 ఏళ్లు 177 రోజులు

5. క్వెనా మఫాకా - 19 ఏళ్లు 124 రోజులు

ఈ మ్యాచ్‌లో మఫాకా బౌలింగ్ ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌లో కొత్త సంచలనం సృష్టించింది. వయసు చిన్నదే అయినా, అతని వేగం, ఖచ్చితత్వం, ధైర్యంతో కూడిన ఆట‌తీరు అత‌న్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి.

55
ఎవరీ క్వెనా మఫాకా?

2024లో జరిగిన ICC U-19 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవ‌డంతో క్వెనా మఫాకా వెలుగులోకి వచ్చాడు. ఆ టోర్నమెంట్‌లో మఫాకా మూడు సార్లు ఐదు వికెట్లు సాధించాడు. మొత్తంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఒకే టోర్నమెంట్‌లో మూడు సార్లు ఐదు వికెట్ల హాల్స్ సాధించిన తొలి 17 ఏళ్ల ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు.

త‌న‌ అద్భుతమైన ప్రదర్శన తర్వాత 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్ 2025లో మఫాకా రాజస్థాన్ రాయల్స్‌లో చేరాడు. అతను SA20లో పార్ల్ రాయల్స్ తరపున కూడా ఆడాడు.

2024లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 సంవత్సరాల 137 రోజుల వయస్సులో మఫాకా తన టీ20 అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కుడైన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల CSA అవార్డ్స్ 2024-25లో క్వెనా మ‌ఫాకా టీ20 ఛాలెంజ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories