Published : Jul 04, 2022, 10:39 AM ISTUpdated : Jul 04, 2022, 10:40 AM IST
ENG vs IND: టీమిండియా సారథి రోహిత్ శర్మ ఐసోలేషన్ ముగిసింది. గడిచిన 8 రోజులుగా కరోనా సోకి క్వారంటైన్ లో ఉన్న హిట్ మ్యాన్ బయటకు వచ్చాడు. నెట్ ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నాడు. కానీ..
గత నెలలో కరోనా బారిన పడి కీలక టెస్టుకు దూరమైన టీమిండియా సారథి రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఎడ్జబాస్టన్ టెస్టుకు ఆరు రోజుల ముందు కరోనా బారిన పడ్డ హిట్ మ్యాన్ కు శనివారంతో పాటు ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ అని తేలిన విషయం తెలిసిందే..
26
తాజాగా రోహిత్ క్వారంటైన్ నుంచి కూడా బయటకు వచ్చాడు. లీస్టర్ షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్బంగా కరోనా సోకడంతో అతడు అప్పట్నుంచి క్వాంరటైన్ లోనే ఉంటున్నాడు. ఇక ఆదివారం క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన హిట్ మ్యాన్.. ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు.
36
క్వారంటైన్ నుంచి వచ్చాక నేరుగా నెట్ ప్రాక్టీస్ సెషన్ కు వెళ్లిన రోహిత్.. ఇంగ్లాండ్ కౌంటీ జట్టుతో టీ20 ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతున్న పాండ్యా సేనతో కలిసి ప్రాక్టీస్ చేశాడు.
46
జులై 7 నుంచి భారత జట్టు.. ఇంగ్లాండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ఇరు జట్లు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. ఎడ్జబాస్టన్ టెస్టు ముగిసిన తర్వాత రెండు రోజుల విరామంతోనే టీ20 సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది.
56
ఇదిలాఉండగా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చి నెట్ సెషనల్ లో పాల్గొన్నా రోహిత్ కు సంబంధించిన మరో పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. రోహిత్ కు సోమవారం కార్డియోవస్క్యులర్ (గుండె రక్త నాళాలకు సంబంధించిన పరీక్ష) టెస్టు చేయాల్సి ఉందని.. ఆ రిపోర్టును బట్టి అతడు తొలి టీ20కి అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది తేలుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన ఆటగాళ్లకు నిబంధనల్లో భాగంగా ఈ టెస్టును నిర్వహిస్తారు.
66
దీంతో పాటు రోహిత్ సోమవారం ఫిట్నెస్ టెస్టును కూడా పాస్ కావాల్సి ఉంది. మరి కార్డియోవస్క్యులర్ టెస్ట్ తో పాటు ఫిట్నెస్ టెస్టు ను పాస్ అయితేనే రోహిత్ టీ20లకు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నదానిపై క్లారిటీ వస్తుంది.