ధోనీ స్టంట్స్‌ని ఇంట్లో కానీ, బయట కానీ ప్రయత్నించవద్దని హెచ్చరించా... భారత మాజీ ఫీల్డింగ్ కోచ్...

First Published Jul 3, 2022, 8:15 PM IST

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని రెండేళ్లు దాటినా, ఎమ్మెస్ ధోనీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టీమిండియాకి కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ ఫ్యాన్స్‌లో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మాహీకి ఇంతటి ఫాలోయింగ్ రావడానికి అతని కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా ఓ కారణం...

Dhoni Stumping

కనురెప్ప పాటు స్టంపౌట్లు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, వికెట్లను చూడకుండా వెనకాల నుంచి గురి చూసి త్రో విసిరేవాడు. మెరుపు రనౌట్లు, కళ్లు చెదిరే స్టంపౌట్లు చేసిన మహీ, వన్డే క్రికెట్‌లో అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు...

Dhoni Stumping

టెస్టుల్లో 256 క్యాచులు, 38 స్టంపౌట్లు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, టీ20ల్లో 57 క్యాచులు, 34 స్టంపౌట్లు చేసిన మాహీ, వన్డే క్రికెట్‌లో 321 క్యాచులు అందుకుని, రికార్డు స్థాయిలో 123 స్టంపౌట్లు చేశాడు...

Dhoni Stumping

అంతర్జాతీయ కెరీర్‌లో 350 వన్డేలు ఆడిన ఎమ్మెస్ ధోనీ 444 వికెట్లలో భాగం పంచుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 100కి పైగా స్టంపౌట్లు చేసిన ఏకైక వికెట్ కీపర్‌గా నిలిచాడు. లంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగర్కర్ 99 స్టంపౌట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు...

dhoni stumping

‘వికెట్ కీపర్‌గా ఎమ్మెస్ ధోనీ ఓ యూనివర్సిటీతో సమానం. వికెట్ కీపింగ్‌ గురించి పుస్తకం రాయాల్సి వస్తే, ధోనీ గురించి ప్రత్యేకంగా ఓ బుక్ రాయాలి. అయితే అతనికి ఆ స్కిల్స్ ఒక్క రోజులో రాలేదు...

dhoni stumping

2011 వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి అతనికి ఆటను ఎలా అర్థం చేసుకోవాలనే విషయం బాగా తెలిసి వచ్చింది. అంతకుముందు ధోనీ వికెట్ కీపింగ్‌లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ముఖ్యంగా స్టంపింగ్‌లో ధోనీ, 2016 తర్వాతే మ్యాజిక్‌లు చేయడం మొదలెట్టాడు...

Dhoni Stumping

అందుకే కుర్రాళ్లను నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఎమ్మెస్ ధోనీ చేసిన పనులను ఇంట్లో కానీ, ప్రాక్టీస్ సెషన్స్‌లో కానీ పొరపాటున కూడా ప్రయత్నించవద్దని. ఎందుకంటే ధోనీ ఆ ప్రయోగాలు చేయడానికి ముందు కొన్ని మిలియన్ల బాల్స్‌ను అందుకున్నాడు...

dhoni stumping

కొన్ని ఏళ్ల పాటు వికెట్ల వెనకాల గడిపాడు. స్టంప్స్ ఎక్కడ ఉన్నాయో, ఎంత హైట్‌లో ఉన్నాయో, తనకు ఏ దిశలో ఉన్నాయో... ఇలా ప్రతీ చిన్న విషయం గురించి క్షుణ్ణంగా స్టడీ చేశాడు. అందుకే అతను అలా మ్యాజిక్ చేయగలిగాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

dhoni stumping

2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న ఎమ్మెస్ ధోనీ, 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే... 

click me!