ధోని, కోహ్లీల చెత్త రికార్డు జాబితాలో చేరిన రోహిత్ శ‌ర్మ

Published : Dec 08, 2024, 06:14 PM IST

Rohit Sharma: అడిలైడ్ ఓవ‌ల్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భార‌త్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల చెత్త రికార్డు జాబితాలో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేరాడు.   

PREV
15
ధోని, కోహ్లీల చెత్త రికార్డు జాబితాలో చేరిన రోహిత్ శ‌ర్మ
Rohit Sharma, Virat Kohli, Gautam Gambhir

Rohit Sharma: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత అడిలైడ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ధీమాగా ఉన్నట్లు క‌నిపించారు. మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంటుంద‌నీ, రోహిత్ శర్మ పునరాగమనంతో జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుందని అందరూ భావించారు.. కానీ, అదేమీ జ‌ర‌గ‌కుండా ఆస్ట్రేలియా చేతిలో భార‌త్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

25
Rohit Sharma-Virat Kohli Test

రెండో టెస్టులో భార‌త్ ఘోర ఓట‌మి 

రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ ఓట‌మితో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డును న‌మోదుచేశాడు. భారత కెప్టెన్ల చెత్త రికార్డు జాబితాలో ఉన్న ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలో రోహిత్ చేరాడు. అడిలైడ్ ఓవల్‌లో గులాబీ బంతితో ఆడిన మ్యాచ్‌లో భారత్ ఓటమి భారత కెప్టెన్‌గా రోహిత్‌కి వరుసగా నాలుగో టెస్టు ఓటమి. మూడు రోజులలో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్-బాల్ టెస్ట్‌లో ఓడిపోవడానికి ముందు 2024 అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌పై రోహిత్ కెప్టెన్సీలో భారత్ మూడు బ్యాక్-టు-బ్యాక్ టెస్టులను కోల్పోయింది.

35
Rohit Sharma

వ‌రుస‌గా నాలుగు ఓట‌ముల కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌

వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిన ఆరో భారత కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు న‌మోదుచేశాడు.  వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన తొలి భారత కెప్టెన్ దత్తా గైక్వాడ్. అతని నాయకత్వంలో, 1959లో జూన్ 4 నుండి ఆగస్టు 24 వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ వరుసగా నాలుగు టెస్టులను కోల్పోయింది. MAK పటౌడీ 1967-68 సీజన్‌లో గైక్వాడ్‌తో అవాంఛిత జాబితాలో చేరాడు. పటౌడీ కెప్టెన్సీలో భారత్ ఆరు వరుస టెస్టుల్లో ఓటములను చవిచూసింది.

45

సచిన్ టెండూల్కర్ 1999-2000 సీజన్‌లో భారత కెప్టెన్‌గా వరుసగా ఐదు టెస్టుల్లో టీమ్ ఓడిపోయింది. MS ధోని కెప్టెన్సీలో భారత్ రెండుసార్లు వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిపోయింది. టెస్టుల్లో భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లి 2020-21 సీజన్‌లో భారత కెప్టెన్‌గా నాలుగు వరుస పరాజయాలను చ‌విచూశాడు. 

 

55
Rohit sharma-Virat Kohli

భారత కెప్టెన్లు-వరుసగా అత్యధిక టెస్టుల్లో ఓట‌ములు

6 – MAK పటౌడీ (1967-68)
5 – సచిన్ టెండూల్కర్ (1999-00)
4 – దత్తా గైక్వాడ్ (1959)
4 – MS ధోని (2011)
4 – MS ధోని (2014)
4 - విరాట్ కోహ్లీ (2020-21)
4 – రోహిత్ శర్మ (2024)

Read more Photos on
click me!

Recommended Stories