భార‌త్ కు ఆసీస్ షాక్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కష్ట‌మేనా?

Published : Dec 08, 2024, 12:33 PM IST

IND vs AUS : రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ తర్వాత ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది.  

PREV
15
భార‌త్ కు ఆసీస్ షాక్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కష్ట‌మేనా?
Cricket, India, IND vs AUS, Team india,

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భార‌త్ జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో సూప‌ర్ విక్ట‌రీ అందుకున్న భార‌త జ‌ట్టు రెండో టెస్టులో మాత్రం ఢీలా ప‌డింది. భారత్ జట్టు పై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయంతో పునరాగమనం చేసింది. పింక్ బాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. పింగ్ బాల్ టెస్టు ఆడటం భారత్‌కు ఎప్పుడూ నష్టమే కలిగిస్తోంది. 

25
Cricket, India, IND vs AUS, Team india,

మారిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమీకరణాలు

భారత జట్టు గత రెండున్నరేళ్లుగా పింగ్ బాల్ తో ఎలాంటి మ్యాచ్ లను ఆడలేదు. దీనికి తోడు భారత బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారీ అంచనాలున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ లు రాణించలేకపోయారు. అలాగే, అనుకూల పరిస్థితుల్లో ఆస్ట్రేలియన్ బౌలర్లు భారత బలహీన బ్యాటింగ్ లైనప్‌పై చాలా బాగా రాణించారు. దీంతో కంగారుల చేతిలో భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమీకరణాలు కూడా మారిపోయాయి. 

35
Cricket, India, IND vs AUS, Team india,

మూడో స్థానానికి పడిపోయిన భారత్ 

అడిలైడ్ ఓవ‌ల్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఆసీస్ చేతిలో భార‌త్ ఓడిపోయింది. ఈ ఓటమి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ స్థానంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండుసార్లు ఫైనల్స్‌కు చేరిన భార‌త  జట్టు ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఓటమి తర్వాత భారత్ పాయింట్ల శాతం (పీసీటీ) 57.29కి దిగజారడంతో ఇప్పుడు ఫైనల్ చేరే మార్గం కష్టంగా మారింది. మరోవైపు పెర్త్‌లో ఎదురుదెబ్బ తగిలిన ఆస్ట్రేలియా మళ్లీ పోటీలోకి దిగింది. ఇప్పుడు 60.71 పీసీటీతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. 

45
Cricket, India, IND vs AUS, Team india,

బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీలో మిగిలిన మ్యాచ్ ల‌ను గెలిచినా ఫైన‌ల్ బెర్త్ క‌ష్ట‌మే..

ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భారత్‌కు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు టీమిండియా త‌ప్ప‌క‌ గెలవాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో భారత్ ఎలాంటి తప్పులు చేయ‌కుండా మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిస్తే ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో  PCT 64.03కి చేరుకుంటుంది. అయితే దీని తర్వాత కూడా ఫైనల్‌లో స్థానం కన్ఫర్మ్ కాదు. ఇదే స‌మ‌యంలో శ్రీలంకపై అద్భుత ప్రదర్శన చేసి దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలోకి చేరింది. ఈ ఓటమితో భారత జట్టు 57.29 శాతం మార్కులతో మూడో స్థానానికి పడిపోయింది. 59.26 శాతం మార్కులతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.

55
Cricket, India, IND vs AUS, Team india,

ఆస్ట్రేలియా WTC ఫైన‌ల్ బెర్త్ మార్గం సులభం

ఆస్ట్రేలియా తన మిగిలిన ఐదు మ్యాచ్‌లలో మూడింటిని (భారత్‌పై మూడు, శ్రీలంకపై రెండు) గెలిస్తే అది ఫైనల్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా మొత్తం మూడు మ్యాచ్‌లను (శ్రీలంకపై ఒకటి, పాకిస్తాన్‌పై రెండు) గెలిస్తే దాని PCT 69 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మిగిలిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి ఆస్ట్రేలియా అవకాశాలను త‌గ్గించ‌డ‌మే భారత్‌కు ఉన్న ఏకైక అవకాశం. భార‌త జ‌ట్టు అవ‌కాశాల‌ను దెబ్బ‌కొట్టిన ఆసీస్ ను చిత్తు చేసి ముందడుగు వేస్తుందో లేదో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories