టీ20 నెంబర్.1 ప్లేయర్ గా రోహిత్ శర్మ.. కోహ్లీని అధిగమిస్తూ రికార్డులు బద్దలు కొట్టాడు

First Published | Jun 24, 2024, 11:41 PM IST

Rohit Sharma-most runs in T20 Cricket: ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త‌ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 92 పరుగుల త‌న ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీ, బాబార్ ఆజంల‌ను అధిగ‌మించి మ‌రో ఘ‌త‌న సాధించాడు. 
 

Rohit Sharma, Virat Kohli

Rohit Sharma-most runs in T20 Cricket: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 సూప‌ర్-8 లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. వ‌రుస సిక్స‌ర్లు బాడుతూ ప‌రుగుల‌ సునామీ సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఆట‌తో టీ20 ప్ర‌పంచ క‌ప్ లో అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. టీ20 క్రికెట్ లో నెంబ‌ర్.1 ప్లేయ‌ర్ గా ఘ‌న‌త‌ను అందుకున్నాడు. 

టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. సెయింట్ లూసియాలో కంగారూ బౌలర్లను సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. రోహిత్ శ‌ర్మ‌ 41 బంతుల్లో 92 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.  తన ఇన్నింగ్స్‌లో, మిచెల్ స్టార్క్ నుండి ఆడమ్ జంపా వరకు అందరి బౌలింగ్ ను చిత్తు చేశాడు. దీంతో భార‌త జ‌ట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.


Rohit Sharma

రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో 92 పరుగుల ఇన్నింగ్స్ తో మ‌రో ఘ‌న‌త సాధించాడు. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌లను  అధిగ‌మించి అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శ‌ర్మ‌ నిలిచాడు. రోహిత్ శ‌ర్మ‌ 157 మ్యాచుల్లో 4165 పరుగులు చేశాడు. పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం 123 మ్యాచ్‌ల్లో 4145 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 123 మ్యాచ్‌ల్లో 4103 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 

అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 19 వేల పరుగులు పూర్తి చేశాడు. హిట్‌మ్యాన్ 478 మ్యాచ్‌ల్లో 19011 పరుగులు చేశాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) 19 వేల పరుగులు పూర్తి చేసిన భారతదేశం నుండి మూడవ, మొత్తంగా 15వ బ్యాట్స్‌మెన్‌గా ఘ‌న‌త సాధించాడు. భార‌త నుంచి అంత‌కుముందు స‌చిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌ల్లో 34357 పరుగులు, విరాట్ కోహ్లి 528 మ్యాచ్‌ల్లో 26,799 పరుగులు సాధించారు. 

టీ20 ప్రపంచకప్ 2024లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు రోహిత్ శ‌ర్మ‌. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంత‌మైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అంత‌కుముందు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ కొట్టిన‌ అమెరికాకు చెందిన ఆరోన్ జోన్స్‌ను వెన‌క్కి నెట్టాడు. డల్లాస్‌లో కెనడాపై ఆరోన్ జోన్స్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

అలాగే, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాడిగా రోహిత్ శ‌ర్మ ఘ‌న‌త సాధించాడు. సెయింట్ లూసియాలో జ‌రిగిన మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షంతో 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 

యువరాజ్ సింగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ విషయంలో యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2007లో డర్బన్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ 7 సిక్సర్లు కొట్టాడు. తాజా ఇన్నింగ్స్ తో రోహిత్ శ‌ర్మ 8 సిక్సర్లు బాదాడు. 

Latest Videos

click me!