Rohit Sharma
Rohit Sharma - T20 Cricket Most Sixes: మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టీమ్ భారత్ లో పర్యటించనుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించగా, ఆదివారం భారత జట్టును ప్రకటించారు. 14 నెలల విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 సిరీస్ కోసం జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ సిరీస్ లో టీమిండియాకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేశారు.
Rohit Sharam
ఇప్పటివరకు రోహిత్ శర్మ 51 టీ20లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో భారత్ 39 టీ20 మ్యాచ్ లను గెలిచింది. కేవలం హిట్ మ్యాన్ సారథ్యంలో 12 మ్యాచుల్లో ఓడిపోవడం గమనార్హం. రోహిత్ శర్మ ఇప్పటివరకు 148 టీ20లు ఆడి 3853 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు సాధించాడు.
దాదాపు ఏడాది తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సృష్టించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ లో ఆడుతున్న రోహిత్ శర్మ ఈ సిరీస్ లో మరో 18 సిక్సర్లు బాదితే టీ20 క్రికెట్ లో 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
Rohit Sharma
రోహిత్ టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు 182 సిక్సర్లు బాదాడు. ఇప్పటి వరకు 182 సిక్సర్లతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ తన కెరీర్ లో ఇప్పటివరకు 464 మ్యాచ్ లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఆడి 582 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఒక్క టెస్టు క్రికెట్లోనే 77 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో 323 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో మరో తొమ్మిది సిక్సర్లు బాదితే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (331) రికార్డును బద్దలు కొడతాడు.