ముంబై ఇండియ‌న్స్ కు బిగ్ షాక్.. సూర్య‌కుమార్ యాద‌వ్ ఐపీఎల్ కు దూర‌మైన‌ట్టేనా.. !

First Published | Jan 8, 2024, 5:06 PM IST

Suryakumar Yadav: వ‌రుస‌గా స్టార్ ప్లేయ‌ర్లు గాయ‌ల‌తో  టీమిండియాకు దూర‌మ‌వుతున్నారు. టీ20 స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. దీని కార‌ణంగా మొత్తం దేశవాళీ సీజన్ తో పాటు ఐపీఎల్ 2024 కు కూడా దూరం కానున్నాడ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 

Suryakumar Yadav

Suryakumar Yadav: ముంబై ఇండియ‌న్స్ కు బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అత‌ను రాబోయే ఐపీఎల్ కొన్ని మ్యాచ్ ల‌కు దూరం కానున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. గాయం కార‌ణంగా ప్ర‌స్తుతం భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ కు దూర‌మ‌య్యాడు.

Suryakumar Yadav

ప్రపంచంలోనే నంబర్ 1ర్యాంక్ టీ20 బ్యాటర్ సూర్య‌కుమార్ యాద‌వ్, దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్ సమయంలో  గాయ‌ప‌డ్డాడు. అప్పటి నుండి అతను క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అయితే, గాయం మ‌రింత ఇబ్బందిని క‌లిగించ‌డంతో రాబోయే సీజ‌న్ల‌కు అందుబాటులో ఉండే అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. 


Suryakumar Yadav

సూర్య కుమార్ యాద‌వ్ కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న హెర్నియాకు ఇప్పుడు సర్జరీ చేయాల్సి వచ్చింది. దీని కార‌ణంగా అత‌ను పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి రెండు నెలల వరకు స‌మ‌యం పట్టవచ్చు.

Suryakumar Yadav

"సూర్య కుమార్ యాద‌వ్ త‌న గాయానికి చికిత్స‌కు సంబంధించి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటాడు. అతని హెర్నియా ఆపరేషన్ తర్వాత అతను శిక్షణ ప్రారంభించడానికి ఎనిమిది-తొమ్మిది వారాలు పట్టవచ్చు.  అత‌ను ఐపీఎల్ సమయంలో ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నామంటూ" ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Suryakumar Yadav

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సూర్య పాల్గొనడంపై పై నివేదిక సానుకూలంగా ఉన్నప్పటికీ, ముంబై ఇండియన్స్  జ‌ట్టు దెబ్బ అనే చెప్పాలి. అత‌ను కోలుకున్న స‌గం ఐపీఎల్ సీజ‌న్ కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చున‌ని సంబంధిత రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Suryakumar Yadav

"సూర్య కుమార్ యాద‌వ్ కు ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ చేయించుకోవడానికి అతను జర్మనీలోని మ్యూనిచ్‌కి వెళ్తాడు. అంటే అతను ఖచ్చితంగా ఆడలేడని అర్థం. ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీలో ముంబై, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌కు ప్రారంభ ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. జూన్‌లో జరగనున్న T20 ప్రపంచకప్ వ‌ర‌కు సూర్య పూర్తిగా కోలుకునే అవ‌కాశ‌ముంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియా త‌న క‌థ‌నంలో పేర్కొంది.

Suryakumar Yadav

స్పోర్ట్స్ హెర్నియాను సాధార‌ణంగా అథ్లెటిక్ పుబల్జియా అని పిలుస్తారు. గజ్జ ప్రాంతంలో లేదా పొత్తికడుపులో ఉన్న కండరాలు, స్నాయువులు లేదా స్నాయువులలో నొప్పి లేదా ఒత్తిడిని కలిగి ఉంటుంది. 

Latest Videos

click me!