ధోనీకి మంచి టీమ్ దొరకడం వల్లే వరల్డ్ కప్ గెలిచాడు! రోహిత్ మంచి కెప్టెనే కానీ... యువరాజ్ సింగ్ కామెంట్...

Published : Aug 08, 2023, 04:22 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో జరుగుతున్న 50 ఓవర్ల ప్రపంచ కప్ టోర్నీ కావడంతో 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలో దిగబోతున్న భారత జట్టుపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు 2011 వరల్డ్ కప్ విన్నర్ యువరాజ్ సింగ్...  

PREV
16
ధోనీకి మంచి టీమ్ దొరకడం వల్లే వరల్డ్ కప్ గెలిచాడు! రోహిత్  మంచి కెప్టెనే కానీ... యువరాజ్ సింగ్ కామెంట్...
Virat Kohli , Rohit Sharma

అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది...

26

‘రోహిత్ శర్మ చాలా మంచి కెప్టెన్, కానీ వర్లడ్ కప్ గెలవాలంటే అతనికి మంచి టీమ్ కూడా కావాలి. ధోనీ కూడా మంచి కెప్టెన్ మాత్రమే కాదు, అతనికి మంచి టీమ్ దొరికింది. అనుభవం ఉన్న మ్యాచ్ విన్నర్లు, మాహీ టీమ్‌లో ఉన్నారు..

36

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి సుదీర్ఘ కాలంగా కెప్టెన్‌గా ఉన్నాడు రోహిత్ శర్మ. ప్రెషర్ పరిస్థితుల్లో టీమ్‌ని ఎలా గెలిపించాలో రోహిత్‌కి బాగా తెలుసు. అయితే ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు చాలా మంచి టీమ్ దొరికింది..

46

మహేంద్ర సింగ్ ధోనీ అయినా, రోహిత్ శర్మ అయినా మంచి టీమ్ దొరకకపోతే, ఏమీ చేయలేరు. వరల్డ్ కప్ గెలవాలంటే మంచి కెప్టెన్ అయితే సరిపోదు, మంచి టీమ్ కూడా కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..

56

2011 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు ప్లేయర్లు, టీమిండియా తరుపున ఆడి అదరగొట్టారు... వీరంతా అప్పటికే వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడిన అనుభవం ఉన్నవారే..

66

2023 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో టీమిండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లతో పాటు జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లతో బరిలో దిగనుంది. అయితే ఈ ముగ్గురూ గాయం నుంచి కోలుకుని వరల్డ్ కప్ ఆడబోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories